
హైదరాబాద్: మొహాలి వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 62 బంతుల్లో 70 (4 ఫోర్లు, ఒక సిక్స్) హాఫ్ సెంచరీతో రాణించడంతో పాటు చివర్లో దీపక్ హుడా 3 బంతుల్లో 14(2 ఫోర్లు, ఒక సిక్స్) టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. దీంతో పంజాబ్‌కు 151 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించలేదు. జట్టు స్కోరు 7 పరుగుల వద్ద జానీ బెయిర్ స్టో(1) పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విజయ్ శంకర్‌తో కలిసి మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని పెంచే క్రమంలో జట్టు స్కోరు 56 పరుగుల వద్ద శంకర్ (26) అశ్విన్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
ఈ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన మహ్మద్ నబి(12) కూడా అశ్విన్ బౌలింగ్‌లో రనౌటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వారంతా వరుసపెట్టి పెవిలియన్‌కు చేరుతున్నా... వార్నర్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని పరుగులు పెట్టించాడు. మనీష్ పాండే(19)తో కలిసి హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశాడు.
ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఈ సీజన్‌లో వార్నర్‌కి ఇది మూడో హాఫ్ సెంచరీ కావడం విశేషం. పాండే ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా 3 బంతుల్లో 14 పరుగులు చేయడంతో సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో అశ్విన్, షమీ, ముజీబ్‌లు తలో వికెట్ తీశారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్
మొహాలి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతోంది. మరోవైపు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రెండు మార్పుల చేసింది.
మురగన్ అశ్విన్, అండ్రూ టైల స్థానంలో అంకిత్ రాజ్‌పుత్, ముజీబ్ ఉర్ రహ్మన్‌లు తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ సీజన్‌లో ఇరు జట్లు చెరో ఐదు మ్యాచ్‌లాడగా... అందులో మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరు పాయింట్లతో కొనసాగుతున్నాయి.
అయితే, సన్‌రైజర్స్ హైదరాబాద్ రన్‌రేట్ మెరుగ్గా ఉండటంతో మూడో స్థానంలో నిలిచింది. ముంబై ఇండియన్స్‌తో ఉప్పల్ వేదికగా జరిగిన గత మ్యాచ్‌లో ఓటమిపాలైన హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్‌లో తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. మరోవైపు పంజాబ్ సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్ కావడంతో విజయం సాధించాలనే గట్టి పట్టుదలతో ఉంది.
జట్ల వివరాలు:
సన్‌రైజర్స్ హైదరాబాద్:
డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో, విజయ్ శంకర్, మనీష్ పాండే, దీపక్ హుడా, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సిద్దార్ధ్ కౌల్, సందీప్ శర్మ
కింగ్స్ ఎలెవన్ పంజాబ్:
కేఎల్ రాహుల్, క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, సర్ఫారజ్ ఖాన్, డేవిడ్ మిల్లర్, మన్‌దీప్ సింగ్, శామ్ కర్రన్, రవిచంద్రన్ అశ్విన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, అంకిత్ రాజ్ పుత్, మహ్మద్ షమీ