
హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా సోమవారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. మొహాలి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతోంది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
మరోవైపు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రెండు మార్పుల చేసింది. మురగన్ అశ్విన్, అండ్రూ టైల స్థానంలో అంకిత్ రాజ్‌పుత్, ముజీబ్ ఉర్ రహ్మన్‌లు తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ సీజన్‌లో ఇరు జట్లు చెరో ఐదు మ్యాచ్‌లాడగా... అందులో మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరు పాయింట్లతో కొనసాగుతున్నాయి.
అయితే, సన్‌రైజర్స్ హైదరాబాద్ రన్‌రేట్ మెరుగ్గా ఉండటంతో మూడో స్థానంలో నిలిచింది. ముంబై ఇండియన్స్‌తో ఉప్పల్ వేదికగా జరిగిన గత మ్యాచ్‌లో ఓటమిపాలైన హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్‌లో తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. మరోవైపు పంజాబ్ సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్ కావడంతో విజయం సాధించాలనే గట్టి పట్టుదలతో ఉంది.
జట్ల వివరాలు:
సన్‌రైజర్స్ హైదరాబాద్:
డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో, విజయ్ శంకర్, మనీష్ పాండే, దీపక్ హుడా, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సిద్దార్ధ్ కౌల్, సందీప్ శర్మ
కింగ్స్ ఎలెవన్ పంజాబ్:
కేఎల్ రాహుల్, క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, సర్ఫారజ్ ఖాన్, డేవిడ్ మిల్లర్, మన్‌దీప్ సింగ్, శామ్ కర్రన్, రవిచంద్రన్ అశ్విన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, అంకిత్ రాజ్ పుత్, మహ్మద్ షమీ
{document1}