Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KXIP vs RCB: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ

RCB

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా శనివారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. ఐఎస్‌ బింద్రా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఒక మార్పుతో బరిలోకి దిగింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

టిమ్‌ సౌథీ స్థానంలో ఉమేశ్‌ యాదవ్‌ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. మరోవైపు పంజాబ్‌ కూడా పలు మార్పులతో బరిలోకి దిగింది. ఆండ్రూ టై, మయాంక్‌ అగర్వాల్‌, మురుగన్‌ అశ్విన్‌లకు పంజాబ్‌ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్‌లో కూడా విజయం సాధించని ఆర్సీబీ ఈ మ్యాచ్‌తో బోణీ కొట్టాలని భావిస్తోంది.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు పంజాబ్‌ ఏడు మ్యాచ్‌లు ఆడి నాలుగింట గెలిచి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. సొంత మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌ కావడంతో పంజాబ్ గెలవాలని పట్టుదలతో ఉంది.

1
45904

జట్ల వివరాలు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), పార్థీవ్‌ పటేల్‌, డివిలియర్స్‌, మొయిన్‌ అలీ, స్టొయినిస్‌, అక్షదీప్‌ నాథ్‌, పవన్‌ నేగి, ఉమేశ్‌ యాదవ్‌, చాహల్‌, నవదీప్‌ సైనీ, మహ్మద్ సిరాజ్‌

కింగ్స్ ఎలెవన్ పంజాబ్
రవిచంద్రన్‌ అశ్విన్‌(కెప్టెన్‌), క్రిస్‌ గేల్‌, కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, నికోలస్‌ పూరన్‌, మన్‌దీప్‌ సింగ్‌, శామ్ కర్రన్‌, ఆండ్రూ టై, మహ్మద్‌ షమీ, మురుగన్‌ అశ్విన్‌

Story first published: Saturday, April 13, 2019, 20:36 [IST]
Other articles published on Apr 13, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+