Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KXIP vs RCB: గేల్ సెంచరీ మిస్, మొహాలిలో ఆర్సీబీ టార్గెట్ 174

Gayle

హైదరాబాద్: మొహాలి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌‌లో క్రిస్ గేల్ 64 బంతుల్లో 99 (10 ఫోర్లు, 5 సిక్సులు)తో రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. దీంతో ఆర్సీబీకి 174 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ మ్యాచ్‌లో పంజాబ్‌కు ఓపెనర్లు తొలి పవర్‌ప్లే ముగిసేసరికి 60 పరుగులు చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 66 పరుగులు జోడించిన తర్వాత కేఎల్ రాహుల్‌(18) ఔటయ్యాడు. చాహల్ వేసిన 7వ ఓవర్ రెండో బంతికి స్టంపౌట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మయాంక్ అగర్వాల్(15) చాహల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్‌ ఖాన్‌(15) కూడా నిరాశపరిచాడు. సిరాజ్ బౌలింగ్‌లో పార్థీవ్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. గేల్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. ఈ క్రమంలో 64 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సులతో 99 పరుగులు చేసి ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్సయ్యాడు.

దీంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో చాహల్‌ రెండు వికెట్లు తీయగా... సిరాజ్‌, మొయిన్‌ అలీలు తలో వికెట్‌ తీశారు.


టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ
అంతకముందు ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఒక మార్పుతో బరిలోకి దిగింది. టిమ్‌ సౌథీ స్థానంలో ఉమేశ్‌ యాదవ్‌ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. మరోవైపు పంజాబ్‌ కూడా పలు మార్పులతో బరిలోకి దిగింది.

ఆండ్రూ టై, మయాంక్‌ అగర్వాల్‌, మురుగన్‌ అశ్విన్‌లకు పంజాబ్‌ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్‌లో కూడా విజయం సాధించని ఆర్సీబీ ఈ మ్యాచ్‌తో బోణీ కొట్టాలని భావిస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు పంజాబ్‌ ఏడు మ్యాచ్‌లు ఆడి నాలుగింట గెలిచి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. సొంత మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌ కావడంతో పంజాబ్ గెలవాలని పట్టుదలతో ఉంది.

జట్ల వివరాలు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), పార్థీవ్‌ పటేల్‌, డివిలియర్స్‌, మొయిన్‌ అలీ, స్టొయినిస్‌, అక్షదీప్‌ నాథ్‌, పవన్‌ నేగి, ఉమేశ్‌ యాదవ్‌, చాహల్‌, నవదీప్‌ సైనీ, మహ్మద్ సిరాజ్‌

కింగ్స్ ఎలెవన్ పంజాబ్
రవిచంద్రన్‌ అశ్విన్‌(కెప్టెన్‌), క్రిస్‌ గేల్‌, కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, నికోలస్‌ పూరన్‌, మన్‌దీప్‌ సింగ్‌, శామ్ కర్రన్‌, ఆండ్రూ టై, మహ్మద్‌ షమీ, మురుగన్‌ అశ్విన్‌

Story first published: Saturday, April 13, 2019, 22:28 [IST]
Other articles published on Apr 13, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+