For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మొహాలిలో KXIP vs MI: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్

IPL 2019 : Kings XI Punjab Won The Toss And Choose To Field | Oneindia Telugu
IPL 2019: KXIP vs MI: Live Updates: Kings XI Punjab win the toss and elect to field

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సొంతగడ్డపై తొలి మ్యాచ్‌కి సిద్ధమైంది. టోర్నీలో భాగంగా శనివారం మొహాలిలోని పంజాబ్ క్రికెట్ ఆసోసియేషన్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో సాయంత్రం 4 గంటలకు తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే ముంబై ఇండియన్స్ బరిలోకి దిగుతుండగా.... కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మాత్రం లెగ్ స్పిన్నర్ మురుగన్ అశ్విన్‌కు తుది జట్టులో చోటు కల్పించింది. మార్చి 27న ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా‌లో నైట్ రైడర్స్‌తో తలపడిన పంజాబ్ ఓడిపోయింది. కోల్‌కతా నిర్ధేశించిన భారీ స్కోరు ఛేదించడంలో విఫలమైంది.

మరోవైపు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచిన ముంబై ఇండియన్స్ మంచి జోరుమీదుంది. మొత్తంగా చెరో రెండు మ్యాచ్‌లు ఆడిన పంజాబ్, ముంబై ఒక్కో మ్యాచ్‌లో గెలిచాయి. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.

పంజాబ్ అభిమానుల ఆశలన్నీ ఓపెనర్ క్రిస్ గేల్‌పైనే ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ బాదిన క్రిస్‌ గేల్ పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక, నైట్‌‌రైడర్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో కేవలం 20 పరుగులు మాత్రమే చేసి గేల్ ఔటయ్యాడు. దీంతో ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓడింది. సొంత గడ్డపై మ్యాచ్ జరుగుతుండటంతో పంజాబ్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగింది.

1
45765

జట్ల వివరాలు:
ముంబై ఇండియన్స్:
క్వింటన్ డీకాక్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, యువరాజ్ సింగ్, కీరన్ పొలార్డ్, హార్ధిక్ పాండ్యా, మిచెల్ మెక్లీన్ గన్, మయాంక్ మార్కండే, జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ

కింగ్స్ ఎలెవన్ పంజాబ్:
కేఎల్ రాహుల్, క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, సర్ఫరాజ్ ఖాన్, డేవిడ్ మిల్లర్, రవిచంద్రన్ అశ్విన్, విజియిన్, ఆండ్రూ టై, మహమ్మద్ షమీ

Story first published: Saturday, March 30, 2019, 16:05 [IST]
Other articles published on Mar 30, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+