Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోల్‌కతా vs పంజాబ్.. ఓడిన జట్టు అవుట్

IPL 2019:KXIP vs KKR Preview: Punjab, Kolkata clash to stay in playoff race

ఐపీఎల్ 2019 సీజన్‌‌లో శుక్రవారం రాత్రి మొహాలి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఇరు జట్లకు అత్యంత కీలకం. ఎందుకంటే.. ప్రస్తుతం పంజాబ్, కోల్‌కతాలు 10 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. ఈ రెండు జట్లకు రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. ఇరు జట్లు మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తే 14 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది.

అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే.. ఈ రోజు పంజాబ్, కలకత్తాలు తలపడనున్నాయి. ఫలితం కచ్చితంగా వస్తుంది కాబట్టి.. ఎదో ఒక జట్టు ఓడిపోతుంది. ఓడిన జట్టు టోర్నీ నుండి నిష్క్రమించడం దాదాపు ఖాయం. ఇప్పటికే రెండు జట్లకు నెట్ రన్ రేట్ తక్కువగా (-) ఉంది. ఓడిన జట్టు తన చివరి మ్యాచ్‌లో గెలిచినా ఉపయోగం ఉండదు. ఎందుకంటే.. సన్‌రైజర్స్‌కు నెట్ రన్ రేట్ (+)లో ఉంది. ఈ రోజటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు కూడా రన్ రేట్ మెరుగుపరుచుకుంటుంది. ఈ సమీకారణాల దృష్ట్యా ఓడిన జట్టుకు అవకాశాలు లేనట్టే.

కోల్‌కతా జట్టుకు క్రిస్‌లిన్, శుభమన్ గిల్, ఆండ్రీ రసెల్, దినేశ్ కార్తీక్ వంటి భారీ హిట్టర్లు ఉన్నారు. వీరిలో ఇద్దరు ఆడిన కోల్‌కతాకు భారీ స్కోర్ ఖాయం. లక్ష్యాన్ని కాపాడడానికి కూడా రసెల్, చావ్లా, నరైన్, గుర్నే వంటి మంచి బౌలర్లు ఉన్నారు. ఇక పంజాబ్ జట్టులో కూడా క్రిస్ గేల్, మిల్లర్ వంటి హిటర్లు ఉన్నా కూడా అంచనాలను అందుకోలేకపోతున్నారు. రాహుల్ పరుగులు చేస్తున్నా.. వేగంగా ఆడలేకపోతున్నాడు. ఇక బౌలింగ్ అశ్విన్ రాణిస్తున్నా.. షమీ తేలిపోతున్నాడు.

జట్లు (అంచనా):

కోల్‌కతా నైట్‌రైడర్స్:
క్రిస్‌లిన్, సునీల్ నరైన్, శుభమన్ గిల్, నితీశ్ రాణా, రాబిన్ ఉతప్ప, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్, కెప్టెన్), ఆండ్రీ రసెల్, పీయూస్ చావ్లా, రింకు సింగ్, గుర్నే, సందీప్ వార్రియర్ .

కింగ్స్ ఎలెవన్ పంజాబ్:
కేఎల్ రాహుల్, క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, డేవిడ్ మిల్లర్, రవిచంద్రన్ అశ్విన్, సిమ్రాన్ సింగ్, మురుగన్ అశ్విన్, ముజీబ్ ఉర్ రెహమాన్, మహమ్మద్ షమీ.

Story first published: Friday, May 3, 2019, 19:23 [IST]
Other articles published on May 3, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+