Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మొహాలిలో KXIP vs DC: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ

IPL 2019, KXIP vs DC IPL Score: Delhi Capitals win the toss and elect to field

హైదరాబాద్: సొంతగడ్డపై కింగ్స్ ఎలెవన్ మరో మ్యాచ్‌కి సిద్ధమైంది. మొహాలిలోని పంజాబ్ క్రికెట్ ఆసోసియేషన్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఒక మార్పు చేసింది. అమిత్ మిశ్రా స్థానంలో అవేశ్ ఖాన్‌ని జట్టులోకి తీసుకుంది.

మరోవైపు కింగ్స్‌ పంజాబ్‌ క్రిస్‌ గేల్‌ను, ఆండ్రూ టైను పక్కన పెట్టింది. వీరి స్థానాల్లో సామ్‌ కర్రాన్, ముజీబ్‌ ఉర్‌ రహ్మన్‌లకు తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. టోర్నీలో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లాడిన పంజాబ్ జట్టు ఒక మ్యాచ్‌లో ఓడి, రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌ విషయానికి వస్తే మూడు మ్యాచ్‌లాడగా ఒక మ్యాచ్‌లో ఓడి.. రెండింట విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్‌‌లో యువ ఓపెనర్ పృథ్వీ షా సూపర్ ఫామ్‌లో ఉండగా.. శిఖర్ ధావన్‌, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ ఫామ్‌లో ఉన్నారు.

మరోవైపు పంజాబ్ జట్టులో కూడా క్రిస్‌గేల్ ఆరంభం నుంచి తన దూకుడుని కొనసాగిస్తుండగా... ఇటీవలే ముంబైతో ముగిసిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌ ఫామ్‌లోకి వచ్చాడు. మిడిలార్డర్‌లో మయాంక్ అగర్వాల్, డేవిడ్ మిల్లర్, సర్ఫరాజ్ ఖాన్, మన్‌దీప్ ఆ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు.

జట్లవివరాలు:
కింగ్ప్‌ పంజాబ్‌

రవిచంద్రన్‌ అశ్విన్(కెప్టెన్‌)‌, కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, డేవిడ్‌ మిల్లర్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, మన్‌దీప్‌ సింగ్‌, విల్జోయిన్‌, సామ్‌ కరాన్‌, మురుగన్‌ అశ్విన్‌, మహ్మద్‌ షమీ, ముజీబ్‌ ఉర్‌ రెహ్మన్‌

ఢిల్లీ క్యాపిటల్స్‌
శ్రేయస్‌ అయ్యర్‌(కెప్టెన్‌), పృథ్వీషా, శిఖర్‌ ధావన్‌, రిషభ్‌ పంత్‌, ఇన్‌గ్రామ్‌, హనుమ విహారి, హర్షల్‌ పటేల్‌, క్రిస్‌ మోరిస్‌, లామ్‌చెన్‌, రబడా, అవేశ్‌ ఖాన్‌

Story first published: Monday, April 1, 2019, 20:12 [IST]
Other articles published on Apr 1, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+