న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KXIP Vs CSK: చెన్నై బ్యాటింగ్, పంజాబ్‌కు ప్లేఆఫ్ బెర్తు దక్కేనా!

IPL 2019: KXIP Vs CSK: Live Updates: Kings XI Punjab win the toss and elect to field

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఆదివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. మొహాలి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

అక్షదీప్‌సింగ్‌ స్థానంలో హర్‌ప్రీత్‌ బ్రార్‌ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. మరోవైపు తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండానే బరిలో దిగుతున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ చెప్పాడు. రెండు జట్లకు ఇది చివరి లీగ్ మ్యాచ్. ఇప్పటికే చెన్నై, ఢిల్లీ, ముంబై జట్లు ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌ చేరగా.. చివరి స్థానం ఎవరిదో ఆదివారం నాటి మ్యాచ్‌లతో తేలనుంది.

ఈ మ్యాచ్‌లో విజయం సాధించి తమ విజయాల సంఖ్యను పెంచుకోవాలని చెన్నై చూస్తుండగా, గెలిచి గౌరవంగా నిష్క్రమించాలని పంజాబ్ భావిస్తోంది. ఇక చివరి ప్లేఆఫ్స్‌ బెర్తు కోసం కోల్‌కతా, హైదరాబాద్‌, పంజాబ్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే బెంగళూరు, రాజస్థాన్‌ జట్లు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించాయి.

కాగా, ప్లేఆఫ్స్‌ చేరిన మూడు జట్లకు, చివరి బెర్తుకు పోటీలో ఉన్న మూడు జట్లకు ఆదివారం నాటి మ్యాచ్ ఫలితాలు కీలకం కానున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ 18 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... 10 పాయింట్లతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆఖరి స్థానంలో కొనసాగుతోంది. దీంతో పంజాబ్ విజయం సాధించడం అత్యంత కీలకం.

1
45931

జట్ల వివరాలు
చెన్నై సూపర్ కింగ్స్
షేన్ వాట్సన్, డుప్లెసిస్, మురళీ విజయ్, అంబటి రాయుడు, సురేశ్ రైనా, కేదార్ జాదవ్, ధోని, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, దీపక్ చాహర్, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్

కింగ్స్ ఎలెవన్ పంజాబ్
కేఎల్ రాహుల్, క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), మన్దీప్ సింగ్, శామ్ కర్రన్, రవిచంద్రన్ అశ్విన్(కెప్టెన్), హర్‌ప్రీత్ బ్రార్‌, మురుగన్ అశ్విన్, మహ్మద్ షమీ, ఆండ్రూ టై

Story first published: Sunday, May 5, 2019, 15:56 [IST]
Other articles published on May 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X