For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KXIP Vs CSK: మొహాలిలో చెన్నైని చిత్తుగా ఓడించిన పంజాబ్

IPL 2019 : Kings XI Punjab Defeat Chennai Super Kings By 6 Wickets || Oneindia Telugu
KL Rahul

హైదరాబాద్: ఐపీఎల్‌లో తన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు విజయం సాధించింది. మొహాలి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 171 పరుగుల విజయ లక్ష్యాన్ని 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసి విజయం సాధించింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

కింగ్స్‌ పంజాబ్‌ విజయంలో కేఎల్‌ రాహుల్‌ 36 బంతుల్లో 71(7 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించగా, క్రిస్‌ గేల్‌ 28 బంతుల్లో 28(2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 108 పరుగులు జోడించి కింగ్స్‌ పంజాబ్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు.


మొహాలిలో పంజాబ్ విజయ లక్ష్యం 171
అంతకముందు ఈ మ్యాచ్‌లో డుప్లెసిస్ 55 బంతుల్లో 96 (10 ఫోర్లు, 4 సిక్సర్లు)తో రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. దీంతో పంజాబ్‌కు 171 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ఆరంభంలోనే షేన్‌ వాట్సన్‌(7) వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సురేశ్ రైనాతో కలిసి మరో ఓపెనర్ డుప్లెసిస్ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డుని ముందుకు నడిపించాడు. వీరిద్దరూ 120 పరుగులు భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత రైనా రెండో వికెట్‌గా ఔటయ్యాడు.

38 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 53 పరుగులు సాధించిన రైనా హాఫ్ సెంచరీ అనంతరం జట్టు స్కోరు 150 పరుగుల వద్ద శామ్ కర్రన్ బౌలింగ్‌లో షమీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత డుప్లెసిస్ దూకుడుగా ఆడిన డుప్లెసిస్ 55 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 96 పరుగులు సాధించాడు.

1
45931

అయితే సెంచరీకి చేరువగా వచ్చిన డుప్లెసిస్‌, శామ్ కర్రన్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. ఐపీఎల్‌లో డుప్లెసిస్‌కు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ధోని (10 నాటౌట్) చేయడంతో సీఎస్‌కే నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. పంజాబ్‌ బౌలర్లలో కర్రాన్ మూడు వికెట్లు తీయగా, షమీ రెండు వికెట్లు తీశాడు.


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్
అంతకముందు ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగింది. అక్షదీప్‌సింగ్‌ స్థానంలో హర్‌ప్రీత్‌ బ్రార్‌ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. మరోవైపు తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండానే బరిలో దిగుతున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ చెప్పాడు.

రెండు జట్లకు ఇది చివరి లీగ్ మ్యాచ్. ఇప్పటికే చెన్నై, ఢిల్లీ, ముంబై జట్లు ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌ చేరగా.. చివరి స్థానం ఎవరిదో ఆదివారం నాటి మ్యాచ్‌లతో తేలనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి తమ విజయాల సంఖ్యను పెంచుకోవాలని చెన్నై చూస్తుండగా, గెలిచి గౌరవంగా నిష్క్రమించాలని పంజాబ్ భావిస్తోంది. ఇక చివరి ప్లేఆఫ్స్‌ బెర్తు కోసం కోల్‌కతా, హైదరాబాద్‌, పంజాబ్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

Story first published: Sunday, May 5, 2019, 20:18 [IST]
Other articles published on May 5, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+