19 బంతుల్లో హాఫ్‌సెంచరీ: భజ్జీని ఉతికారేసిన కేఎల్ రాహుల్

హైదరాబాద్: ఐపీఎల్ 12వ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు కేఎల్ రాహుల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. టోర్నీలో భాగంగా ఆదివారం మొహాలి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ సీజన్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడి రికార్డు కూడా కేఎల్ రాహుల్ పేరిట ఉంది. 2018 ఐపీఎల్ సీజన్‌లో కేఎల్ రాహుల్ 14 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇదే ఇప్పటివరకు రికార్డు. కాగా, ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 12వ సీజన్‌లో మాత్రం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఆటగాడు హర్ధిక్ పాండ్యా 17 బంతుల్లో సెంచరీ సాధించాడు.

19 బంతుల్లో హాఫ్ సెంచరీ
ఈ సీజన్‌లో ఇదే ఇప్పటివరకు నమోదైన రికార్డు. ఆ తర్వాత వాంఖడె వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రిషబ్ పంత్ 18 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. తాజాగా, కేఎల్ రాహుల్ 19 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి ఈ సీజన్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు.

ఆకాశమే హద్దుగా చెలరేగిన కేఎల్ రాహుల్
ఈ మ్యాచ్‌లో డుప్లెసిస్ 55 బంతుల్లో 96 (10 ఫోర్లు, 4 సిక్సర్లు)తో రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. అనంతరం 171 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఓపెనర్లలో కేఎల్ రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. పవర్ ప్లేలో రెండో ఓవర్ వేసిన హర్భజన్ సింగ్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్‌లో రెండు సిక్సులు బాదాడు. దీంతో భజ్జీ వేసిన మొదటి ఓవర్‌లో 18 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో కెప్టెన్ ధోని... భజ్జీకి పవర్ ప్లేలో బౌలింగ్ ఇవ్వలేదు.

రెచ్చిపోయిన కేఎల్ రాహుల్
ఆ తర్వాత హర్భజన్ సింగ్ వేసిన నాలుగో ఓవర్‌లో రాహుల్ మరోసారి రెచ్చిపోయాడు. ఈ ఓవర్‌లో రాహుల్ 24 పరుగులు రాబట్టాడు. హ్యాట్రిక్ బౌండరీలతో ఓవర్‌ను మొదలుపెట్టిన కేఎల్ రాహుల్ చివర్లో సిక్సుల మోత మోగించాడు. దీంతో 20 బంతులలోపు రెండు హాఫ్ సెంచరీలు సాధించిన కేకేఆర్ ఆటగాడు సునీల్ నరేన్ సరసన కేఎల్ రాహుల్ నిలిచాడు.

14 మ్యాచ్‌ల్లో 593 పరుగులు
ఈ సీజన్‌లో కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. నిలకడగా ఆడుతూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో మొత్తం 14 మ్యాచ్‌లాడిన కేఎల్ రాహుల్ 593 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇందులో ఒక సెంచరీ, ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో డేవిడ్ వార్నర్ (12 మ్యాచ్‌ల్లో 692) అగ్రస్థానంలో ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications