For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్: రసెల్‌ ప్రాక్టీస్‌.. బౌండరీలు, సిక్సర్లే (వీడియో)

IPL 2019: Kolkata Player Andre Russell power on his practice at the Eden Gardens

ఐపీఎల్ టోర్నీ సీజన్-12లో విండీస్‌ విధ్వంసకర ఆటగాడు ఆండ్రూ రసెల్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్ తరపున ఆడుతున్నాడు. రసెల్‌ విద్వంసానికి ఈ సీజన్‌లో కోల్‌కతా జట్టు ఓటమి అంచు నుండి బయటపడి విజయాన్ని అందుకుంది. ఈ సీజన్ అన్ని మ్యాచ్‌లలో రసెల్‌ పరుగులు చేసినా.. ముఖ్యంగా రెండు మ్యాచ్‌లలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై 19 బంతుల్లో 49 పరుగులు.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై 17బంతుల్లో 48 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఇప్పటివరకు సీజన్‌-12లో రసెల్‌ 10 మ్యాచ్‌లు ఆడి.. 65.33 సగటుతో 392 పరుగులు చేశాడు. 217 స్ట్రైక్‌రేట్‌ ఉంది, ఇది ప్రస్తుత సీజన్‌లో అత్యుత్తమం. రసెల్‌ ఇప్పటికే 41 సిక్సర్లు బాదాడు. మరి ఇంత అలవోకగా సిక్సులు ఎలా కొడుతున్నాడు అనే సందేహం అందరికీ వస్తుంది. దీనికి సమాధానం దొరికింది. ప్రాక్టీస్‌ సెషన్‌లో కూడా రసెల్‌ ప్రతి బంతినీ బౌండరీలు, సిక్సర్లే లక్ష్యంగా బాదడంతోనే.. మ్యాచ్‌లలో కూడా అలవోకగా సిక్సర్లు బాడగలుగుతున్నాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ షేర్‌ చేసిన ఓ వీడియో చూస్తే ఇదే అర్ధమవుతోంది. మరి మీరు కూడా ఓ లుక్కేయండి.

ఐపీఎల్ టోర్నీలో భాగంగా గురువారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఈ మ్యాచ్‌కి ఆతిథ్యమిస్తోంది. కోల్‌కతా ఆడిన 10 మ్యాచ్‌ల్లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై.. 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు రాజస్థాన్ ఆడిన పది మ్యాచ్‌ల్లో కేవలం మూడింట్లో విజయం సాధించి పట్టికలో చివరి స్థానంలో ఉంది. దీంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఓడితే.. ప్లేఆఫ్ ఆశలు గల్లంతే. కోల్‌కతా ఓడితే మాత్రం ఓ చివరి ఆకాశం (14 పాయింట్లతో) ఉంది. కోల్‌కతా జట్టు గెలిస్తే మాత్రం ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి. అయితే రసెల్‌ చెలరేగితే కోల్‌కతాకు విజయం సులువే.

Story first published: Thursday, April 25, 2019, 17:04 [IST]
Other articles published on Apr 25, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+