
హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఈ మ్యాచ్‌లో కోల్‌కతా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. కరియప్ప, గర్నేల స్థానంలో ప్రశిద్ధ్ కృష్ణ, కార్లోస్ బ్రాత్‌వైట్‌లను జట్టులోకి తీసుకుంది. మరోవైపు రాజస్థాన్ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. ఆస్టన్ టర్నర్, ధావల్ కులకర్ణీల స్థానంలో ఓషెన్ థామస్, వరుణ్ అరోణ్‌లను జట్టులోకి తీసుకుంది.
ఈ సీజన్‌ను ఎంతో ఘనంగా ఆరంభించిన కోల్‌కతా ఆ తర్వాత వరుస ఓటములతో ఢీలాపడింది. ఆడిన 10 మ్యాచ్‌ల్లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఇక, రాజస్థాన్ విషయానికి వస్తే పది మ్యాచ్‌ల్లో కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించి టేబుల్‌లో ఆఖరి స్థానంలో కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం కానుంది. కాగా, ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డు 6-1గా ఉంది. 2008 ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఒకే ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈడెన్‌లో ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 7 మ్యాచ్‌లు జరగ్గా అందులో కేకేఆర్ ఆరింట విజయం సాధించింది.
జట్ల వివరాలు:
రాజస్థాన్ రాయల్స్
రహానే, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), బెన్ స్టోక్స్, రేయాన్ పరాగ్, స్టువర్ట్ బిన్నీ, జోప్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, జయదేవ్ ఉనాద్కత్, ఓషెన్ థామస్, వరుణ్ అరోణ్
కోల్‌కతా నైట్‌రైడర్స్
క్రిస్ లిన్, సునీల్ నరేన్, రాబిన్ ఊతప్ప, నితీష్ రాణా, దినేశ్ కార్తీక్, శుభమాన్ గిల్, ఆండ్రీ రస్సెల్, పియూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్, కార్లోస్ బ్రాత్‌వైట్, ప్రసిద్ధ్ కృష్ణ