Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs RR: చెలరేగిన దినేశ్ కార్తీక్, రాజస్థాన్ విజయ లక్ష్యం 176

Dinesh Karthik

హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కెప్టెన్ దినేశ్ కార్తీక్ 50 బంతుల్లో 97(7 ఫోర్లు, 9 సిక్సులు)తో సూపర్ ఇన్నింగ్స్ ఆడటంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్ రాయల్స్‌కు 176 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ మ్యాచ్ ఆరంభంలోనే ఓపెనర్ క్రిస్ లిన్ వికెట్ కోల్పోయింది. వరుణ్ ఆరోన్ వేసిన మొదటి ఓవర్ మూడో బంతికి క్రిస్ లిన్(0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వరుణ్ ఆరోన్ వేసిన ఐదో ఓవర్ చివరి బంతికి శుభ్‌మాన్ గిల్(14) కూడా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో కోల్‌కతా 31 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నితీశ్ రానా(21) శ్రేయస్ గోపాల్ వేసిన 9వ ఓవర్ రెండో బంతికి వరుణ్ ఆరోన్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం సునీల్‌ నరైన్‌(11), ఆండ్రీ రసెల్‌(14)లు సైతం స్వల్ప స్కోరుకే పెవిలియన్ ‌ చేరారు. ఈ సమయంలో కెప్టెన్ దినేశ్ కార్తీక్ వికెట్ కాపాడుకుంటూ ఒంటరి పోరాటం చేశాడు.

ఈ క్రమంలో 50 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సులతో 97 పరుగులు చేశాడు. దీంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. రాజస్థాన్‌ బౌలర్లలో వరుణ్‌ అరోన్‌ రెండు వికెట్లు తీయగా, థామస్‌, శ్రేయస్‌ గోపాల్‌, ఉనాద్కత్‌లకు తలో వికెట్‌ లభించింది.


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్
అంతకముందు టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. కరియప్ప, గర్నేల స్థానంలో ప్రశిద్ధ్ కృష్ణ, కార్లోస్ బ్రాత్‌వైట్‌లను జట్టులోకి తీసుకుంది. మరోవైపు రాజస్థాన్ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. ఆస్టన్ టర్నర్, ధావల్ కులకర్ణీల స్థానంలో ఓషెన్ థామస్, వరుణ్ అరోణ్‌లను జట్టులోకి తీసుకుంది.

ఈ సీజన్‌ను ఎంతో ఘనంగా ఆరంభించిన కోల్‌కతా ఆ తర్వాత వరుస ఓటములతో ఢీలాపడింది. ఆడిన 10 మ్యాచ్‌ల్లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఇక, రాజస్థాన్ విషయానికి వస్తే పది మ్యాచ్‌ల్లో కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించి టేబుల్‌లో ఆఖరి స్థానంలో కొనసాగుతోంది.

1
45919

ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం కానుంది. కాగా, ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డు 6-1గా ఉంది. 2008 ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఒకే ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈడెన్‌లో ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 7 మ్యాచ్‌లు జరగ్గా అందులో కేకేఆర్ ఆరింట విజయం సాధించింది.


జట్ల వివరాలు:
రాజస్థాన్ రాయల్స్

రహానే, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), బెన్ స్టోక్స్, రేయాన్ పరాగ్, స్టువర్ట్ బిన్నీ, జోప్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, జయదేవ్ ఉనాద్కత్, ఓషెన్ థామస్, వరుణ్ అరోణ్‌

కోల్‌కతా నైట్‌రైడర్స్
క్రిస్ లిన్, సునీల్ నరేన్, రాబిన్ ఊతప్ప, నితీష్ రాణా, దినేశ్ కార్తీక్, శుభమాన్ గిల్, ఆండ్రీ రస్సెల్, పియూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్, కార్లోస్ బ్రాత్‌వైట్‌, ప్రసిద్ధ్ కృష్ణ

Story first published: Thursday, April 25, 2019, 22:15 [IST]
Other articles published on Apr 25, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+