
హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. అనారోగ్యం కారణంగా ఆర్సీబీ విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ ఈ మ్యాచ్‌కి దూరం కాగా అతడి స్థానంలో పేసర్ డేల్ స్టెయిన్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. 9 ఏళ్ల తర్వాత డేల్ స్టెయిన్ తిరిగి ఆర్సీబీ జెర్సీలో మ్యాచ్ ఆడుతున్నాడు.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లాడిన కోల్‌కతా నాలుగింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతుండగా... ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఏడింట ఓటమిపాలై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతోంది.
ఈ మ్యాచ్‌కి ముందు ఇరు జట్లు ఆడిన గత మ్యాచ్‌ల్లో ఓటమిపాలయ్యాయి. ఆర్సీబీ ఇప్పటికే ప్లేఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో గనుక బెంగళూరు ఓడిపోతే ఇక ప్లేఆఫ్‌కు చేరే అవకాశాన్ని కోల్పోతుంది. ఇక, కేకేఆర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్ బరిలో నిలవాలని భావిస్తోంది.
జట్ల వివరాలు:
కోల్‌కతా నైట్‌రైడర్స్
క్రిస్ లిన్, సునీల్ నరేన్, రాబిన్ ఊతప్ప, నితీష్ రాణా, దినేశ్ కార్తీక్, శుభమాన్ గిల్, ఆండ్రీ రస్సెల్, పియూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్, హ్యారీ గుర్నే, ప్రసిద్ధ్ కృష్ణ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
పార్ధీవ్ పటేల్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ(కెప్టెన్), మొయిన్ అలీ, హెన్రిచ్ క్లాసెన్, మార్కస్ స్టోయినిస్, అక్షదీప్ నాథ్, పవన్ నేగి, డేల్ స్టెయిన్, నవదీప్ షైనీ, మహ్మద్ సిరాజ్, యజువేంద్ర చాహల్