For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KKR vs RCB: ఈడెన్‌లో కోహ్లీ సెంచరీ, కోల్‌కతా విజయ లక్ష్యం 214

Kohli

హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ 58 బంతుల్లో 100(9 ఫోర్లు, 4 సిక్సులు), మొయిన్ అలీ 28 బంతుల్లో 66(5 ఫోర్లు, 6 సిక్సులు) రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు 214 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ మ్యాచ్ ఆరంభంలోనే ఓపెనర్ పార్ధివ్‌ పటేల్‌(11) వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అక్షదీప్‌ నాథ్‌(13)కూడా నిరాశపరచడంతో 59 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన మొయిన్‌ అలీ(28 బంతుల్లో 66)తో కలిసి కోహ్లీ స్కోరు బోర్డుని పరిగెత్తించాడు.

వీరిద్దరూ కలిసి నిలకడగా ఆడుతూ మూడో వికెట్‌కు 90 పరుగులు జోడించారు. మొయిన్‌ అలీ రెచ్చిపోయి ఆడుతుంటే కెప్టెన్ కోహ్లీ అతడికి చక్కటి సహకారం లభించింది. ఈ క్రమంలోనే కోహ్లీ తొలుత హాఫ్‌ సెంచరీ సాధించగా, ఆ తర్వాత కొద్దిసేపటికే మొయిన్ అలీ కూడా హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.

కుల్దీప్‌ వేసిన ఇన్నింగ్స్ 16 ఓవర్‌లో 27 పరుగులు సాధించిన మొయిన్‌ అలీ ఆ ఓవర్‌ ఆఖరి బంతికి ప్రసిధ్ కృష్ణకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అలీ ఔటైన తర్వాత కోహ్లీ మరింత దూకుడుగా ఆడి సెంచరీ సాధించాడు. సెంచరీ అనంతరం ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి గుర్నే బౌలింగ్‌‌లో శుభమాన్ గిల్‌కి క్యాచ్ ఇచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ తొలి పది ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేస్తే, చివరి 10 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లలో ఆండ్రీ రస్సెల్, కుల్దీప్ యాదవ్, సునీల్ నరేన్, గర్నేలు తలో వికెట్ తీసుకున్నారు.


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా
హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. అనారోగ్యం కారణంగా ఆర్సీబీ విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ ఈ మ్యాచ్‌కి దూరం కాగా అతడి స్థానంలో పేసర్ డేల్ స్టెయిన్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. 9 ఏళ్ల తర్వాత తిరిగి ఆర్సీబీ జెర్సీలో డెల్ స్టెయిన్ మ్యాచ్ ఆడుతున్నాడు.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లాడిన కోల్‌కతా నాలుగింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతుండగా... ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఏడింట ఓటమిపాలై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతోంది.

1
45911

ఈ మ్యాచ్‌కి ముందు ఇరు జట్లు ఆడిన గత మ్యాచ్‌ల్లో ఓటమిపాలయ్యాయి. ఆర్సీబీ ఇప్పటికే ప్లేఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో గనుక బెంగళూరు ఓడిపోతే ఇక ప్లేఆఫ్‌కు చేరే అవకాశాన్ని కోల్పోతుంది. ఇక, కేకేఆర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్ బరిలో నిలవాలని భావిస్తోంది.

జట్ల వివరాలు:
కోల్‌కతా నైట్‌రైడర్స్

క్రిస్ లిన్, సునీల్ నరేన్, రాబిన్ ఊతప్ప, నితీష్ రాణా, దినేశ్ కార్తీక్, శుభమాన్ గిల్, ఆండ్రీ రస్సెల్, పియూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్, హ్యారీ గుర్నే, ప్రసిద్ధ్ కృష్ణ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
పార్ధీవ్ పటేల్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ(కెప్టెన్), మొయిన్ అలీ, హెన్రిచ్ క్లాసెన్, మార్కస్ స్టోయినిస్, అక్షదీప్ నాథ్, పవన్ నేగి, డేల్ స్టెయిన్, నవదీప్ షైనీ, మహ్మద్ సిరాజ్, యజువేంద్ర చాహల్

Story first published: Friday, April 19, 2019, 22:30 [IST]
Other articles published on Apr 19, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+