Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'నా కన్నా క్రిస్ గేలే పెద్ద హిట్టర్‌'

IPL 2019 : Chris Gayle Is A Bigger Hitter Than Me Says Andre Russell | Oneindia Telugu
IPL 2019, KKR vs KXIP: Chris Gayle is Still a Bigger Hitter than Me Says Andre Russell

హైదరాబాద్: తన కన్నా పంజాబ్ ఓపెనర్ క్రిస్ గేలే పెద్ద హిట్టర్‌ అని ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ వెల్లడించాడు. బుధవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఆండ్రీ రసెల్ (48: 17 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులు) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు 218 పరుగుల భారీ స్కోరు చేసింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

కోల్‌కతాకు రెండో విజయం

కోల్‌కతాకు రెండో విజయం

సొంతగడ్డపై కోల్‌కతాకు ఇది రెండో విజయం కావడం విశేషం. లక్ష్య ఛేదనలో పంజాబ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 190 పరుగులకే పరిమితమైంది. దీంతో ఈ మ్యాచ్‌లో కోల్‌కతా 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ఆండ్రీ రస్సెల్ మాట్లాడుతూ తనకంటే గేలే పెద్ద హిట్టర్‌ అని చెప్పాడు. తొలి ఆరు ఓవర్లలోపే అతడిని ఔట్‌ చేయడం తమ అదృష్టమని అన్నాడు.

గేల్‌ను నియంత్రించాలనుకున్నామని

సాధ్యమైనంతగా గేల్‌ను నియంత్రించాలనుకున్నామని.. ఆ విషయంలో సక్సెస్ అవడంతో మ్యాచ్‌లో విజయం సాధించగలిగామని రస్సెల్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో రస్సెల్ భారీ సిక్సర్లతో విరుచుకపడగా.. చేధనలో దూకుడుగా కనిపించిన క్రిసే గేల్ ఎక్కువసేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో ఆండ్రీ రసెల్ 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు.

షమీ విసిరిన యార్కర్‌కి రస్సెల్ క్లీన్ బౌల్డ్

మహ్మద్ షమీ విసిరిన యార్కర్‌కి రస్సెల్ క్లీన్ బౌల్డయ్యాడు. అయితే అంపైర్ దానిని నోబాల్‌గా ప్రకటించాడు. టీ20ల్లో తొలి ఆరు ఓవర్లు (పవర్ ప్లే) ముగిసిన తర్వాత 20 ఓవర్ల వరకూ 30 యార్డ్ సర్కిల్‌లో కనీసం నలుగురు ఫీల్డర్లు ఉండాలి. కానీ, ఆండ్రీ రస్సెల్ బౌల్డయిన బంతిని షమీ విసిరిన సమయంలో 30 యార్డ్ సర్కిల్‌లో కేవలం ముగ్గురు ఫీల్డర్లు మాత్రమే ఉండటాన్ని అశ్విన్ గమనించలేదు.

నోబాల్‌గా ప్రకటించిన ఫీల్డ్ అంపైర్‌

దీంతో థర్డ్ అంపైర్‌తో సమీక్షించిన ఫీల్డ్ అంపైర్‌ ఆ బంతిని నోబాల్‌గా ప్రకటించాడు. ఆ తర్వాత రస్సెల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఎంతలా అంటే.. మహ్మద్ షమీ వేసిన తర్వాత ఓవర్‌లో వరుసగా 6, 6, 6, 4 బాదిన రసెల్.. ఆండ్రూ టై బౌలింగ్‌లోనూ 6, 4, 4, 6 సాధించాడు. కేవలం 17 బంతుల్లో 48 పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. దీంతో కోల్‌కతా చివరి 19 బంతుల్లో ఏకంగా 56 పరుగులు రాబట్టింది.

Story first published: Thursday, March 28, 2019, 17:03 [IST]
Other articles published on Mar 28, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+