
హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు మూడు మార్పులతో బరిలోకి దిగింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
గత మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు ఇచ్చిన సామ్ కర్రన్ స్థానంలో హర్దుస్ విలోజెన్‌కు అవకాశం కల్పించింది. మరోవైపు డేవిడ్ మిల్లర్‌తో పాటు వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌లో అరంగేట్రం చేయనున్నాడు. మన్కడిండ్ వివాదం జరుగుతున్న మ్యాచ్ కావడంతో అందరి దృష్టి పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్‌పైనే ఉంది.
కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు సొంతగడ్డపై ఇది రెండో మ్యాచ్ కావడం విశేషం. కోల్‌కతా తుది జట్టులో కెప్టెన్ దినేశ్ కార్తీక్ ఎలాంటి మార్పులు చేయలేదు. ఇప్పటికే ఇరు జట్లు తాము ఆడిన తొలి మ్యాచ్‌ల్లో గెలిచి శుభారంభం చేశాయి.
కాగా, ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒంటిచేత్తో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ని గెలిపించిన హిట్టర్ ఆండ్రీ రసెల్ (49 నాటౌట్) సూపర్ ఫామ్‌లో ఉండగా.. రాజస్థాన్‌పై రాయల్స్‌పై మెరుపు హాఫ్ సెంచరీతో క్రిస్‌గేల్ (79) జోరుమీదున్నాడు. దీంతో ఈ మ్యాచ్‌లో ఈ విండిస్ దిగ్గజాలు ఎలా ఆడతారోనని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.
సన్‌రైజర్స్‌తో నిర్దేశించిన 182 పరుగుల చేధనలో తడబడిన కోల్‌కతా 15.3 ఓవర్లు ముగిసే సమయానికి 118/4తో ఓడిపోయేలా కనిపించింది. అయితే, చివర్లో ఆండ్రూ రసెల్ విజృంభణతో మరో 2 బంతులు మిగిలి ఉండగానే కోల్‌కతా విజయాన్ని అందుకుంది. అంతేకాదు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని కూడా అందుకున్నాడు.
మరోవైపు రాజస్థాన్ రాయల్స్‌తో జైపూర్ వేదికగా గత సోమవారం జరిగిన మ్యాచ్‌లో క్రిస్‌గేల్ హాఫ్ సెంచరీ చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో తడబడిన రాజస్థాన్ 170 పరుగులే చేయడంతో 14 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది.
జట్ల వివరాలు:
కోల్‌కతా నైట్‌రైడర్స్: క్రిస్‌లిన్, నితీశ్ రాణా, రాబిన్ ఉతప్ప, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్, కెప్టెన్), శుభమన్ గిల్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, పీయూస్ చావ్లా, కుల్దీప్ యాదవ్, లూకీ ఫర్గూసన్, ప్రదీశ్ క్రిష్ణ
కింగ్స్ ఎలెవన్ పంజాబ్: కేఎల్ రాహుల్, క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్, డేవిడ్ మిల్లర్, మన్‌దీప్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్, విజియన్, వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ షమీ, ఆండ్రూ టై