
హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శుభ్‌మాన్ గిల్ 39 బంతుల్లో 65 (7 ఫోర్లు, 2 సిక్సులు), ఆండ్రీ రస్సెల్ 21 బంతుల్లో 45 (3 ఫోర్లు, 4 సిక్సులు) రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీకి 179 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఈ మ్యాచ్‌లో ఇషాంత్ శర్మ వేసిన మొదటి ఓవర్ తొలి బంతికి కేకేఆర్ ఓపెనర్ జో డెన్లీ బౌల్డ్ అయ్యాడు. ఇది జో డెన్లీకి ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్ కావడం విశేషం. దీంతో తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే గోల్డెన్ డక్‌గా డెన్లీ ఔట్ కావడంతో చెత్త రికార్డును మూటగట్టకున్నాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాబిన్ ఊతప్పతో కలిసి శుభ్‌మాన్ గిల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.
వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కి 63 పరుగులు జోడించారు. ఈ దశలో రబాడ వేసిన 9వ ఓవర్ నాలుగో బంతికి ఊతప్ప(28) వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన రాణా(11) క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 93 పరుగుల వద్ద కోల్‌కతా మూడో వికెట్ కోల్పోయింది.
అయితే, శుభ్‌మాన్ గిల్ మాత్రం నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. 39 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులతో 65 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద కిమో పాల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి గిల్ పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత రెండు పరుగుల వ్యవధిలోనే దినేశ్ కార్తీక్(2) కూడా ఔటయ్యాడు.
ఈ దశలో క్రీజులోకి వచ్చిన అండ్రే రస్సెల్ మరోసారి చెలరేగిపోయాడు. 21 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 45 పరుగులు చేశాడు. అయితే, క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో రబడాకు క్యాచ్ ఇచ్చి రస్సెల్ వెనుదిరిగాడు. చివర్లో పియూష్ చావ్లా దూకుడుగా ఆడటంతో కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో క్రిస్ మోరిస్, రబాడ, కీమో పాల్‌లు తలో రెండు వికెట్లు తీయగా, ఇషాంత్ శర్మ ఒక వికెట్ తీశాడు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
అంతకముదు ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా తుది జట్టులో మూడు మార్పులు చేసింది. ఓపెనర్లు క్రిస్ లిన్, సునీల్ నరైన్, హారీ గర్నీలను తప్పించి వీరి స్థానంలో ఫెర్గుసన్, జో డెన్లే, కార్లోస్ బ్రాత్‌వైట్‌లకు తుది జట్టులో చోటు కల్పించింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. సందీప్ లమిచానే స్థానంలో కీమో పాల్‌ని తుది జట్టులోకి తీసుకుంది.
ఫిరోజ్ షా కోట్లా వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో రబాడ అద్భుతమైన యార్కర్‌తో రస్సెల్‌ను పెవిలియన్‌కు చేర్చి విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే. అయితే, ఈసారి ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ రెండు జట్లు మరోసారి తలపడనున్నాయి. సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్ కావడంతో కేకేఆర్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.
జట్ల వివరాలు
కోల్‌కతా నైట్ రైడర్స్:
జోయ్ డెన్లీ, దినేశ్ కార్తీక్(కెప్టెన్), రాబిన్ ఉతప్ప, క్రిస్ లిన్, శుభ్‌మాన్ గిల్, ఆండ్రీ రస్సెల్, పీయూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్, ప్రసీద్ కృష్ణ, ఫెర్గూసన్, కార్లోస్ బ్రాత్‌వైట్
ఢిల్లీ క్యాపిటల్స్:
శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), పృథ్వీ షా, శిఖర్ ధావన్, రిషబ్ పంత్, కొలిన్ ఇంగ్రామ్, అక్షర్ పటేల్, రాహుల్ తెవాటియా, కగిసో రబాడ, ఇషాంత్ శర్మ, క్రిస్ మోరిస్, ట్రెంట్ బౌల్ట్.