

హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. 179 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 180 పరుగుు చేసింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్ 63 బంతుల్లో 97 (11 ఫోర్లు, 2 సిక్సులు) తృటిలో సెంచరీ మిస్సయ్యాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
179 పరుగుల లక్ష్య చేధనలో ఢిల్లీ క్యాపిటల్స్ మూడో ఓవర్‌లోనే తొలి వికెట్ కోల్పోయింది. ప్రశిద్ధ్ కృష్ణ వేసిన ఈ ఓవర్‌లో పృథ్వీ షా వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం ఆండ్రీ రస్సెల్ వేసిన ఆరో ఓవర్ 4వ బంతికి శ్రేయస్(6) కూడా కార్తీక్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ఈ దశలో క్రీజులోకి దిగిన రిషబ్ పంత్, మరో ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలిసి స్కోరు బోర్డుని నడిపించాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కి 105 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఓపెనర్ శిఖర్ ధావన్ ఐపీఎల్‌లో 32వ హాఫ్ సెంచరీని సాధించాడు. అదే సమయంలో రిషబ్ పంత్(46) నితీశ్ రానా బౌలింగ్ కుల్దీప్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన కొలిన్ ఇన్‌గ్రామ్(14)తో కలిసి ధావన్ దూకుడుగా ఆడి ఆడటంతో ఢిల్లీ క్యాపిటల్స్ 18.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది,
ఢిల్లీ క్యాపిటల్స్ విజయ లక్ష్యం 179
ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మాన్ గిల్ 39 బంతుల్లో 65 (7 ఫోర్లు, 2 సిక్సులు), ఆండ్రీ రస్సెల్ 21 బంతుల్లో 45 (3 ఫోర్లు, 4 సిక్సులు) రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీకి 179 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఈ మ్యాచ్‌లో ఇషాంత్ శర్మ వేసిన మొదటి ఓవర్ తొలి బంతికి కేకేఆర్ ఓపెనర్ జో డెన్లీ బౌల్డ్ అయ్యాడు. ఇది జో డెన్లీకి ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్ కావడం విశేషం. దీంతో తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే గోల్డెన్ డక్‌గా డెన్లీ ఔట్ కావడంతో చెత్త రికార్డును మూటగట్టకున్నాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రాబిన్ ఊతప్పతో కలిసి శుభ్‌మాన్ గిల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.
వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కి 63 పరుగులు జోడించారు. ఈ దశలో రబాడ వేసిన 9వ ఓవర్ నాలుగో బంతికి ఊతప్ప(28) వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన రాణా(11) క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 93 పరుగుల వద్ద కోల్‌కతా మూడో వికెట్ కోల్పోయింది.
అయితే, శుభ్‌మాన్ గిల్ మాత్రం నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. 39 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులతో 65 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద కిమో పాల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి గిల్ పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత రెండు పరుగుల వ్యవధిలోనే దినేశ్ కార్తీక్(2) కూడా ఔటయ్యాడు.
ఈ దశలో క్రీజులోకి వచ్చిన అండ్రే రస్సెల్ మరోసారి చెలరేగిపోయాడు. 21 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 45 పరుగులు చేశాడు. అయితే, క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో రబడాకు క్యాచ్ ఇచ్చి రస్సెల్ వెనుదిరిగాడు. చివర్లో పియూష్ చావ్లా దూకుడుగా ఆడటంతో కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో క్రిస్ మోరిస్, రబాడ, కీమో పాల్‌లు తలో రెండు వికెట్లు తీయగా, ఇషాంత్ శర్మ ఒక వికెట్ తీశాడు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
అంతకముదు ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా తుది జట్టులో మూడు మార్పులు చేసింది. ఓపెనర్లు క్రిస్ లిన్, సునీల్ నరైన్, హారీ గర్నీలను తప్పించి వీరి స్థానంలో ఫెర్గుసన్, జో డెన్లే, కార్లోస్ బ్రాత్‌వైట్‌లకు తుది జట్టులో చోటు కల్పించింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. సందీప్ లమిచానే స్థానంలో కీమో పాల్‌ని తుది జట్టులోకి తీసుకుంది.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లాడిన కోల్‌కతా నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఇక, ఢిల్లీ విషయానికి వస్తే, ఆరు మ్యాచ్‌ల్లో మూడింట విజయం సాధించి ఆఖరి నుంచి మూడో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటికే ఢిల్లీతో తలపడిన మ్యాచ్‌లో కేకేఆర్ ఓడిపోయింది.
ఫిరోజ్ షా కోట్లా వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో రబాడ అద్భుతమైన యార్కర్‌తో రస్సెల్‌ను పెవిలియన్‌కు చేర్చి విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే. అయితే, ఈసారి ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ రెండు జట్లు మరోసారి తలపడనున్నాయి.