Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs DC: కోల్‌కతా బ్యాటింగ్, ఇరు జట్లు మార్పులతో బరిలోకి

KKR

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా తుది జట్టులో మూడు మార్పులు చేసింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఓపెనర్లు క్రిస్ లిన్, సునీల్ నరైన్, హారీ గర్నీలను తప్పించి వీరి స్థానంలో ఫెర్గుసన్‌, జో డెన్లే, కార్లోస్ బ్రాత్‌వైట్‌లకు తుది జట్టులో చోటు కల్పించింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. సందీప్ లమిచానే స్థానంలో కీమో పాల్‌ని తుది జట్టులోకి తీసుకుంది.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లాడిన కోల్‌కతా నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఇక, ఢిల్లీ విషయానికి వస్తే, ఆరు మ్యాచ్‌ల్లో మూడింట విజయం సాధించి ఆఖరి నుంచి మూడో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటికే ఢిల్లీతో తలపడిన మ్యాచ్‌లో కేకేఆర్ ఓడిపోయింది.

ఫిరోజ్ షా కోట్లా వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌లో రబాడ అద్భుతమైన యార్కర్‌తో రస్సెల్‌ను పెవిలియన్‌కు చేర్చి విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే. అయితే, ఈసారి ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ రెండు జట్లు మరోసారి తలపడనున్నాయి. సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్ కావడంతో కేకేఆర్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.

జట్ల వివరాలు
కోల్‌కతా నైట్‌ రైడర్స్‌:

జోయ్ డెన్లీ, దినేశ్‌ కార్తీక్‌(కెప్టెన్‌), రాబిన్‌ ఉతప్ప, క్రిస్‌ లిన్, శుభ్‌మాన్‌ గిల్, ఆండ్రీ రస్సెల్, పీయూష్‌ చావ్లా, కుల్దీప్‌ యాదవ్, ప్రసీద్‌ కృష్ణ, ఫెర్గూసన్‌, కార్లోస్ బ్రాత్‌వైట్

ఢిల్లీ క్యాపిటల్స్‌:
శ్రేయాస్‌ అయ్యర్‌(కెప్టెన్‌), పృథ్వీ షా, శిఖర్‌ ధావన్, రిషబ్‌ పంత్, కొలిన్‌ ఇంగ్రామ్, అక్షర్‌ పటేల్, రాహుల్‌ తెవాటియా, కగిసో రబాడ, ఇషాంత్ శర్మ, క్రిస్‌ మోరిస్, పాల్

Story first published: Friday, April 12, 2019, 19:48 [IST]
Other articles published on Apr 12, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+