Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ, ఏబీ కోసం ప్రణాళికలు రచించాం: ఆర్సీబీతో మ్యాచ్‌పై చావ్లా

 IPL 2019: KKR’s Piyush Chawla confident of taking on Virat Kohli and AB de Villiers

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఈ సీజన్‌లో కోల్‌కతా మూడు మ్యాచ్‌లాడి రెండింట విజయం సాధించగా... ఆర్సీబీ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఆర్సీబీ ఓటమికి అనేక కారణాలు

ఈ నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఆర్సీబీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. సీఎస్‌కే జరిగిన మ్యాచ్‌లో పిచ్ ప్రభావం, ముంబైతో జరిగిన రెండో మ్యాచ్‌లో అంపైర్ తప్పిదం, సన్‌రైజర్స్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో బ్యాటింగ్ విఫలం... చివరగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జట్టు సమిష్టి విఫలం ఇలా బెంగళూరు ఓటమిపాలైంది.

నాలుగు మ్యాచుల్లోనూ ఆర్సీబీ ఓటమి

ఇలా వరుసగా నాలుగు మ్యాచుల్లోనూ ఆర్సీబీ ఓడిపోయినా ఆ జట్టుని తక్కువ అంచనా వేయవద్దని కోల్‌కతా వెటరన్ స్పిన్నర్ పియూష్ చావ్లా అభిప్రాయపడ్డాడు. ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్ నేపథ్యంలో చావ్లా మాట్లాడుతూ "ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లోనూ గెలవలేకపోవచ్చు. కానీ ఆర్సీబీ తిరిగి పుంజుకుంటుంది. వచ్చే మ్యాచుల్లో విజయాలు అందుకునే సత్తా ఆ జట్టుకు ఉంది" అని చెప్పాడు.

మేం పరుగులు ఇచ్చి ఉండొచ్చు

ఆర్సీబీ జట్టులోని స్టార్ ఆటగాళ్లు అయిన విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌ను కట్టడి చేసేందుకు ప్రణాళికలు రచించామని చావ్లా తెలిపాడు. కోల్‌కతా ప్రతి మ్యాచ్‌లోనూ ప్రత్యర్థి జట్టుకు 180కి పైగా పరుగులు చేసే అవకాశం ఇస్తోందన్న వ్యాఖ్యలపై "అవును మేం పరుగులు ఇచ్చి ఉండొచ్చు. కానీ, మా జట్టు 200 పరుగులు చేస్తున్న విషయాన్నీ గుర్తించాలి" అని వెల్లడించాడు.

జట్లు అంచనా:

జట్లు అంచనా:

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), పార్థివ్‌ పటేల్‌(వికెట్‌ కీపర్‌), ఏబీ డివిలియర్స్‌, స్టొయినీస్‌, మెుయిన్‌ అలీ, శివమ్ దూబె, అక్షదీప్‌ నాథ్‌, టిమ్‌ సౌథీ, ఉమేశ్‌యాదవ్‌, నవదీప్‌ సైనీ, యుజువేంద్ర చాహల్‌.

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌: దినేశ్‌ కార్తీక్‌(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), క్రిస్‌ లిన్‌, సునీల్‌నరైన్‌, నితీశ్‌ రాణా, రాబిన్‌ఉతప్ప, శుభ్‌మన్‌ గిల్‌, అండ్రీ రసెల్‌, పియూష్‌చావ్లా, ఫెర్గూసన్‌, కుల్దీప్‌ యాదవ్‌, ప్రసిద్‌ కృష్ణ.

Story first published: Friday, April 5, 2019, 19:15 [IST]
Other articles published on Apr 5, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+