న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒకే ఓవర్లో రెండు వికెట్లు.. ఖలీల్‌ అహ్మద్‌ 'ఫోన్ కాల్' సెలెబ్రేషన్స్

IPL 2019: Khaleel Ahmed's 'Phone Call' Celebrations During Eliminator Match Against Delhi Capitals
IPl 2019: Khaleel Ahmeds Phone Call Celebration Will Surely Enjoy a lot

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ పేసర్ ఖలీల్‌ అహ్మద్‌ 'ఫోన్ కాల్' సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. బుధవారం రాత్రి విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఖలీల్‌ 'ఫోన్ కాల్' సెలెబ్రేషన్స్:

అనంతరం 163 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఓపెనర్లు ధావన్, పృద్విషాలు మంచి ఆరంభం ఇచ్చారు. ఇద్దరు పోటాపోటీగా బౌండరీలు బాదుతూ జట్టు స్కోరును 50 పరుగులు దాటించారు. 8వ ఓవర్లో ధావన్‌ను దీపక్ హుడా పెవిలియన్‌కు పంపాడు. 11వ ఓవర్ రెండో బంతికి కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ను.. చివరి బంతికి పృద్విషాను ఖలీల్‌ అహ్మద్‌ అవుట్ చేసాడు. అప్పటికే అర్ధ సెంచరీ చేసి ఊపుమీదున్న షా పెవిలియన్ చేరడంతో ఖలీల్‌ విచిత్రంగా సంబరాలు చేసుకున్నాడు. చేతుతో నంబర్స్ నొక్కి.. హలో అంటూ మైదానంలో పరుగెత్తుతూ 'ఫోన్ కాల్' సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు.

ఇక మ్యాచ్ గెలుస్తాం:

దీనికి సంబందించిన వీడియోను ఐపీఎల్ యాజమాన్యం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఉంచింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. క్రికెట్ అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్లు పెడుతున్నారు. 'నేనున్నానంటూ సెలెక్టర్లకు సంకేతాలు ఇచ్చాడు' అని ఒక అభిమాని పోస్ట్ చేసాడు. 'ఇక మ్యాచ్ గెలుస్తాం అని ఎవరికో కాల్ చేసాడు' అని మరో అభిమాని సరదాగా పోస్ట్ చేసాడు.

అహ్మద్‌ను ఆటపట్టించిన విరాట్ కోహ్లీ:

అహ్మద్‌ను ఆటపట్టించిన విరాట్ కోహ్లీ:

తాజాగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కూడా ఖలీల్‌ సంబరాలు చేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అవుట్ చేసిన అనంతరం ఖలీల్‌ తన చేతులతో విచిత్రంగా సంబరాలు చేసుకున్నాడు. ఆ మ్యాచ్ అనంతరం కోహ్లీని ఖలీల్‌ కలిసాడు. ఆ సమయంలో కోహ్లీ కూడా అచ్చం ఖలీల్‌ లాగానే చేతులు ఊపుతూ సరదాగా ఆటపట్టించాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి నవ్వుకున్నారు.

Story first published: Thursday, May 9, 2019, 15:30 [IST]
Other articles published on May 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X