Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బెంగళూరులో గల్లీ క్రికెట్ ఆడిన కెవిన్ పీటర్సన్ (వీడియో)

IPL 2019: Kevin Pietersen plays gully cricket in Bengaluru ahead of RCB vs MI

హైదరాబాద్: ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ బెంగళూరు వీధుల్లో గల్లీ క్రికెట్ ఆడాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2019 సీజన్‌లో కెవిన్ పీటర్సన్ కామెంటేటర్‌గా వ్వవహారిస్తున్నాడు. దీంతో భారత్‌లో అన్ని నగరాల్లో పర్యటిస్తున్నాడు. టోర్నీలో భాగంగా గురువారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు-ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ మ్యాచ్ నేపథ్యంలో బెంగళూరుకి చేరుకున్న కెవిన్ పీటర్సన్ గల్లీలో పిల్లలు క్రికెట్‌ ఆడుతుండటాన్ని చూసి వారితో కాసేపు క్రికెట్‌ ఆడి సందడి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు.

"భారత్‌లో ఎప్పటినుంచో గల్లీ క్రికెట్‌ ఆడాలనే కోరిక ఉండేది. అది ఈ రోజు తీరింది. మ్యాచ్‌కు వెళ్తున్న సమయంలో రోడ్డు పక్కన కొందరు పిల్లలు క్రికెట్‌ ఆడటం చూశాను. వెంటనే కారు ఆపి వారితో క్రికెట్‌ ఆడాను. చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా అభి అనే పిల్లవాడి బౌలింగ్‌ నన్ను ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది. అతడిలో మంచి టాలెంట్‌ ఉంది" అని కామెంట్ పోస్టు చేశాడు.

Story first published: Thursday, March 28, 2019, 19:31 [IST]
Other articles published on Mar 28, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+