Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్: కేదార్‌ జాదవ్‌కు గాయం.. ప్లేఆఫ్స్‌కు దూరం?

IPL 2019 : Kedar Jadhav Sustains Shoulder Injury, Chennai Super Kings To Miss Him In Play-Offs
IPL 2019: Kedar Jadhav sustains shoulder injury, Chennai Super Kings to miss him in play-offs

ఐపీఎల్‌లో లీగ్ దశ మ్యాచ్‌లు ముగిసాయి. ముంబై, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాయి. అయితే ఈ కీలక సమరానికి ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌కు షాక్ తగిలింది. పంచకప్‌ జట్టులో చోటు దక్కించుకున్న టీమిండియా బ్యాట్స్‌మన్‌, చెన్నై ఆటగాడు కేదార్‌ జాదవ్‌ గాయపడ్డాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఆదివారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌండరీ వద్ద ఫీల్డింగ్‌ చేస్తుండగా జాదవ్‌ ఎడమ భుజానికి గాయమైంది. దీంతో ప్లేఆఫ్స్‌కు కేదార్‌ దాదాపు దూరమయినట్లేనని వార్తలు వస్తున్నాయి. మరోవైపు గాయం చిన్నదే అయినా త్వరలో కీలక టోర్నీ పంచకప్‌ ఉన్న నేపథ్యంలో కేదార్‌ జాదవ్‌కు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది.

తాజాగా చెన్నై జట్టు కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ జాదవ్ గాయంపై స్పందించారు. 'సోమవారం కేదార్‌ భుజానికి ఎక్స్‌రే, స్కానింగ్‌ తీస్తారు. ఆ తర్వాతే గాయం తీవ్రత ఎంత ఉందని ఓ అంచనాకు రావొచ్చు. అయితే అతను మళ్లీ ప్లేఆఫ్స్‌ ఆడే అవకాశాలు కనిపించట్లేదు. కేదార్‌ అసౌకర్యంగా కదులుతున్నాడు. అయితే అంతలా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఏదైనా పరీక్షల తర్వాతే చెపుతాం' అని ఫ్లెమింగ్‌ తెలిపారు.

Story first published: Monday, May 6, 2019, 9:32 [IST]
Other articles published on May 6, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+