న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్: ధోనీకి అల్పాహారం తినిపిస్తున్న జాదవ్‌ (వీడియో)

IPL 2019 : Jadhav Shares His Breakfast With Dhoni
IPL 2019: Kedar Jadhav feeds Captain MS Dhoni from his plate

ఐపీఎల్ రాకముందు క్రికెట్ ఆటగాళ్లు మైదానంలో కయ్యానికి కాలుదువ్వేవారు. ముఖ్యంగా ఆసీస్ ఆటగాళ్లు అయితే మైదానంలో బ్యాట్స్‌మన్‌లను తమ మాటలతో రెచ్చగొట్టేవారు. అయితే ఐపీఎల్ వచ్చాక పూర్తిగా మారిపోయింది. వేర్వేరు దేశ ఆటగాళ్లు అందరూ కలిసి ఒక జట్టుకే ప్రాతినిధ్యం వహిస్తుండడంతో.. స్నేహపూర్వక వాతావరణం నెలకొంది. ఒకప్పటిలా ఆటగాళ్లు ఇప్పుడు దూషించుకోకుండా సన్నిహితంగా ఉంటున్నారు. ఇక ఒకే దేశానికి చెందిన ఆటగాళ్ల మధ్య అయితే ఈ స్నేహం మరింత ఎక్కువ అని నిరూపించారు చెన్నై ఆటగాళ్లు.

బ్రోమాన్స్‌ లవ్‌:

మ్యాచ్ అనంతరం దొరికిన సమయాన్ని చెన్నై ఆటగాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాట్స్‌మన్‌ కేదర్‌ జాదవ్‌ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి అల్పాహారం తినిపిస్తున్నాడు. ధోనీ అల్పాహారం తింటూ కాఫీ తాగుతున్నాడు. దీనికి సంబందించిన వీడియోను జాదవ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేశాడు. అంతేకాదు 'బ్రోమాన్స్‌ లవ్‌' అనే కాప్షన్ పెట్టాడు.

విడదీయలేని బంధం:

విడదీయలేని బంధం:

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్లు పెడుతున్నారు. 'విడదీయలేని బంధం' ఓ అభిమాని కామెంట్ పెట్టగా.. ప్రపంచకప్‌లో చోటు వస్తుందిలే జాదవ్ భాయ్ అని మరొకరు కామెంట్ పెట్టారు. 'మీరు ఎంతో మందికి ఆదర్శం' అని మరికొంతమంది సరదాగా కామెంట్ చేశారు.

హైదరాబాద్‌తో చెన్నై ఢీ :

హైదరాబాద్‌తో చెన్నై ఢీ :

ఈ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ వరుస విజయాలతో దుమ్మురేపుతోంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచులలో 7 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఒక్క ముంబైతో జరిగిన మ్యాచులోనే చెన్నైకి షాక్ తగిలింది. ఆదివారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో చెన్నై విజయం సాధించిన విషయం తెలిసిందే. బుధవారం హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో చెన్నై తలపడనుంది.

Story first published: Monday, April 15, 2019, 13:06 [IST]
Other articles published on Apr 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X