సన్‌రైజర్స్‌కు షాక్.. స్వదేశానికి విలియమ్సన్

చెన్నై వేదికగా మంగళవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఉన్నపళంగా స్వదేశానికి పయనమయ్యాడు. విలియమ్సన్ బామ్మ కన‍్నుమూయడంతో.. అతను న్యూజిలాండ్‌కు బయలుదేరాడు. దీంతో ఈ రోజు చెన్నైతో జరగనున్న మ్యాచ్‌లో విలియమ్సన్ ఆడట్లేదు. ఏప్రిల్ 27న రాజస్తాన్‌తో జరిగే మ్యాచ్‌కు విలియమ్సన్ అందుబాటులో ఉంటాడట.
విలియమ్సన్ స్వదేశానికి పయనమవవడంతో సన్‌రైజర్స్ సారధ్య బాధ్యతలు పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ చేపట్టనున్నాడు. ఇంతకుముందు కూడా విలియమ్సన్‌కు గాయం అయిన సందర్భంలో భువనేశ్వర్ సారధ్య బాధ్యతలు చేపట్టాడు. సన్‌రైజర్స్ రెండు వరుస విజయాలతో పాయింట్లను మెరుగుపరుచుకుని నాలుగో స్థానంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధించి ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగుపర్చుకోవాలని చూస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications