Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సూపర్ 'ఓవర్' థ్రిల్లర్: కోల్‌కతాపై ఢిల్లీ విజయం

IPL 2019 : Delhi Capitals Beat Kolkata Knight Riders In Super Over || Oneindia Telugu
DC

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. వరుసగా రెండు విజయాలతో మంచి జోరుమీదున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌‌ని 'సూపర్ ఓవర్‌'‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చిత్తుగా ఓడించింది. తొలుత ఆండ్రీ రసెల్ (62), కెప్టెన్ దినేశ్ కార్తీక్ (50) హాఫ్ సెంచరీలు సాధించడంతో కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఆ తర్వాత ఛేదనలో పృథ్వీ షా (99: 55 బంతుల్లో 12 ఫోర్లు, 3సిక్సులు) ఐపీఎల్ కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడటంతో ఢిల్లీ కూడా 6 వికెట్ల నష్టానికి సరిగ్గా 185 పరుగులే చేసింది. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు వికెట్ నష్టానికి 10 పరుగులు చేయగా.. ఛేదనలో కోల్‌కతా 7/1కే పరిమితమైంది.

ఢిల్లీ బౌలర్‌ రబడా తన సూపర్‌ బౌలింగ్‌తో జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ సీజన్‌లో కోల్‌కతాకి ఇదే తొలి ఓటమికాగా, ఢిల్లీకి ఇది రెండో విజయం కావడం విశేషం.

1
45766

ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నిర్దేశించిన 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి జట్టులో యువ ఓపెనర్ పృథ్వీ షా(99) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అయితే తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. పృథ్వీకి తోడుగా కెప్టెన్ శ్రేయాస్‌ అయ్యర్‌(43)కూడా రెచ్చిపోయి ఆడాడు. షా, అ‍య్యర్‌లు క్రీజులో ఉన్నంత సేపు ఢిల్లీ అలవోక విజయాన్ని సాధిస్తుందని అంతా భావించారు.

అయితే, వీరిద్దరి నిష్క్రమణ తర్వాత మిగతా బ్యాట్స్‌మన్‌ పూర్తిగా విఫలమయ్యారు. రిషబ్ పంత్‌(11), హనుమ విహారీ(2) వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేరారు. దీంతో చివరి ఓవర్లో ఢిల్లీ విజయానికి ఆరు పరుగులు కావాల్సిన సమయంలో ఆజట్టు కేవలం ఐదు పరుగులే చేసింది. కోల్‌కతా బౌలర్లలో కుల్దీప్‌ రెండు, ఫెర్గుసన్‌, చావ్లా, రసెల్‌లు తలో వికెట్‌ తీశారు.

సూపర్‌ ఓవర్లు సాగాయి ఇలా:
* ప్రసిద్ధ్‌ కృష్ణ బౌలింగ్‌లో ఢిల్లీ బ్యాట్స్‌మన్‌ 1, 4, ఔట్‌ (శ్రేయస్‌), 2, 2, 1లతో మొత్తం 10 పరుగులు సాధించారు.

* రబడ వేసిన ఓవర్లో కోల్‌కతా 4, 0, ఔట్‌ (రసెల్‌), 1, 1, 1లతో మొత్తం 7 పరుగులు చేసి ఓటమిపాలైంది.

Story first published: Sunday, March 31, 2019, 7:48 [IST]
Other articles published on Mar 31, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+