ఐపీఎల్ ఆల్ టైమ్ రికార్డుని కగిసో రబాడ బద్దలు కొట్టేనా?

హైదరాబాద్: ఐపీఎల్ ఆరంభ సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆటను చూస్తే ప్లేఆఫ్‌కు చేరుతుందని ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే గత ఆరేళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్‌కు చేరుకోవడంలో ఫెయిల్ అవుతుంది. అయితే, ఈసారి మాత్రం అలా కాదు... ఈ సీజన్‌లో ప్లేఆఫ్‌కు చేరిన రెండో జట్టుగా నిలిచింది. తద్వారా ఏడేళ్ల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్‌కు చేరుకుంది. ఇందుకు కారణం మాత్రం దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ కగిసో రబాడ అని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
23 ఏళ్ల కగిసో రబాడని 2017 ఐపీఎల్ సీజన్ కోసం నిర్వహించిన వేలంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్(ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్) సొంతం చేసుకుంది. అయితే, తన ఆరంభ సీజన్‌లో ఆశించిన స్థాయిలో కగిసో రబాడ ప్రదర్శన చేయలేదు. కేవలం 6 వికెట్లు మాత్రమే తీశాడు. ఐపీఎల్ 2018 సీజన్‌కు గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.

ఐపీఎల్ 2019 సీజన్‌లో
అయితే, ఐపీఎల్ 2019 సీజన్‌లో మాత్రం తానెంత విలువైన ఆటగాడినో యాజమాన్యానికి తెలిసేలా చేశాడు. ప్రపంచంలోనే క్యాష్ రిచ్ టోర్నీగా పేరొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో తన అద్భుతమైన బౌలింగ్‌తో విజయవంతమైన పేస్ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అతడి అనుభవం ఢిల్లీకి ఎంతగానో ఉపయోగపడింది.

కగిసో రబాడ వద్ద పర్పుల్ క్యాప్
పవర్ ప్లేతో పాటు డెత్ ఓవర్లలో కీలక వికెట్లు తీసి అనేక మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు విజయాలను కట్టబెట్టాడు. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడికి ఇచ్చే పర్పుల్ క్యాప్‌ని ఈ సీజన్‌లో కగిసో రబాడ సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 25 వికెట్లు తీసి ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ఇమ్రాన్ తాహిర్ 17 వికెట్లతో రెండోస్థానంలో
మరోవైపు దక్షిణాఫ్రికాకు చెందిన మరో బౌలర్ ఇమ్రాన్ తాహిర్ 17 వికెట్లతో రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ సీజన్‌లో ఇమ్రాన్ తాహిర్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడుతోన్న సంగతి తెలిసిందే. కగిసో రబాడ ఇదే ఫామ్ గనుక కొనసాగిస్తే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టిస్తాడు.

అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా బ్రావో
ఇప్పటివరకు ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా వెస్టిండిస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో (32 వికెట్లు) ఉన్నాడు. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో గనుక కగిసో రబాడ మరో 8 వికెట్లు గనుక బ్రావో రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది. 7 వికెట్లు తీస్తే మాత్రం బ్రావో రికార్డుని సమం చేస్తాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications