Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్: విమానంలో విలియమ్సన్‌ను భయపెట్టిన జానీ బెయిర్ (వీడియో)

IPL 2019: Johny Bairstow Plays Prank on Kane Willamson In-Flight Ahead of KXIP Clash

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్‌ జానీ బెయిర్‌స్టో చేసిన ఫ్రాంక్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. రెండు నెలలు పాటు జరిగే ఈ టోర్నీ బిజీ షెడ్యూల్‌ కారణంగా ఆటగాళ్లు ఎక్కువగా విమానాల్లో ప్రయాణం చేస్తున్నారు. ప్రత్యర్ధి జట్టు మైదానాల్లో ఆడేందుకు గాను జట్టులోని ఆటగాళ్లు విమానాల్లోనే ప్రయాణించాల్సి ఉంటుంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

టోర్నీలో భాగంగా సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కి మొహాలిలోని ఐఎస్ బింద్రా స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఈ మ్యాచ్ కోసం సన్‌రైజర్స్‌ జట్టు హైదరాబాద్‌ నుంచి మొహాలి వెళ్తుండగా సన్‌రైజర్స్‌ ఓపెనర్ జానీ బెయిర్‌స్టో విమానంలో ఆ జట్టు కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను ఆటపట్టించాడు.

ఈ వీడియోలో సీట్ల వెనుక దాక్కున్న జానీ బెయిర్ స్టో... కేన్ విలియమ్సన్ వచ్చే సమయానికి లేచి అరుస్తూ భయపెట్టాడు. ఇలా చేయడంతో విమానంలో తన పక్కనే కూర్చున్న జట్టులోని మిగతా ఆటగాళ్లు నవ్వుకున్నారు. ఈ వీడియోను సన్‌రైజర్స్‌ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయింది.

Story first published: Monday, April 8, 2019, 19:28 [IST]
Other articles published on Apr 8, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+