న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్: అరగంట ముందుగానే ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లు

IPL 2019 : IPL Playoff Matches To Begin Half An Hour Early || Oneindia Telugu
IPL 2019: IPL playoff matches to begin half an hour early

ఐపీఎల్ సీజన్-12లోని ప్లేఆఫ్‌ మ్యాచ్‌లను అరగంట ముందుగా (రాత్రి 7.30 నుంచే) ప్రారంభించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ మేరకు శనివారం క్రికెట్‌ పాలకుల కమిటీ (సీఓఏ) నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అయితే ప్రసారదారుతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

అరగంట ముందుగానే ప్లేఆఫ్స్‌:

అరగంట ముందుగానే ప్లేఆఫ్స్‌:

ఐపీఎల్‌లో రెండవ మ్యాచ్ సాధారణంగా రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. స్లో ఓవర్‌ రేట్‌.. ఆటగాళ్ల డ్రింక్స్‌.. ఇన్నింగ్స్ కీలక సమయాల్లో కెప్టెన్, బౌలర్ చర్చలు.. ఫీల్డింగ్‌లో మార్పుల కోసం కెప్టెన్లు ఎక్కువ సమయం తీసుకోవడం.. మంచు కారణంగా బంతిపై పట్టు దొరకపోవడం లాంటి కారణాలతో మ్యాచ్‌లు అర్ధరాత్రి వరకు కొనసాగుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ప్లేఆఫ్‌ మ్యాచ్‌లను అరగంట ముందుగా ప్రారంభించాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే తుది నిర్ణయంను త్వరలో వెల్లడించనుంది.

ఉప్పల్ స్టేడియంలో ఫైనల్‌ మ్యాచ్:

ఉప్పల్ స్టేడియంలో ఫైనల్‌ మ్యాచ్:

ఏప్రిల్ 7న చెన్నైలో క్వాలిఫయర్-1 మ్యాచ్.. వైజాగ్‌లో 8, 10న ఎలిమినేటర్, క్వాలిఫయర్-2 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇక మే 12న హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఫైనల్‌ మ్యాచ్ జరగనుంది. నిబంధనల ప్రకారం ఫైనల్ మ్యాచ్ చెన్నైలో జరగాల్సి ఉంది. చిదంబరం మైదానంలో స్యాండ్స్ వివాదం కారణంగా.. గతేడాది రన్నరప్ హైదరాబాద్ కావడంతో ఇక్కడ ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు.

గతేడాది 7 గంటలకే:

గతేడాది 7 గంటలకే:

గతేడాది కూడా మ్యాచ్‌లు అర్ధరాత్రి వరకు కొనసాగుతుండడంతో.. సిబ్బందితో పాటు, మైదానంలోని ప్రేక్షకులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దీంతో ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లను 7 గంటలకే ప్రారంభించారు. ఫైనల్లో హైదరాబాద్ భారీ స్కోర్ చేసినా.. చెన్నై ఓపెనర్ షేన్ వాట్సన్ సెంచరీ చేయడంతో చెన్నై ట్రోఫీ నిలబెట్టుకుంది.

Story first published: Sunday, April 28, 2019, 10:43 [IST]
Other articles published on Apr 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X