ఐపీఎల్‌లో ఆడినన్ని రోజులు ఆర్సీబీకే!: చాహల్ మనసులో మాట

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడినన్ని రోజులు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకే ఆడాలని ఉందని చైనామన్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ చెప్పుకొచ్చాడు. తన అద్భుతమైన బౌలింగ్‌తో చాహల్ ఆర్సీబీని ఐపీఎల్ రేసులోకి తీసుకొచ్చాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లాడిన చాహల్ 14 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లకు ఇచ్చి పర్పుల్ క్యాప్ రేసులో మూడో స్థానంలో ఉన్నాడు. లెగ్ స్పిన్నర్‌గా భారత జట్టు తరుపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన చాహల్ అనేకసార్లు జట్టు విజయాల్లో కీలకంగా వ్యవహారించాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ముఖ్యంగా తన సహచర బౌలర్ కుల్దీప్ యాదవ్‌తో కలిసి చాహల్ అద్భుతాలు చేశాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో సైతం చాహల్ చోటు దక్కించుకున్నాడు. తాజాగా ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్యూలో చాహల్ ఆర్సీబీ తనకు ఒక కుటుంబంలాంటిదని చెప్పుకొచ్చాడు.

ఆర్సీబీ కుటుంబం లాంటిది
"ఆర్సీబీ కుటుంబం లాంటిది. 2014లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసినప్పుడు ఇన్ని సంవత్సరాలు ఒకే జట్టుకు ఆడతానని అనుకోలేదు. జీవితాంతం ఆర్సీబీ జట్టుకే ఆడాలనుకుంటున్నా" అని చాహల్ అన్నాడు. ఇక, ఆర్సీబీ సొంతమైదానం చిన్నస్వామి స్టేడియంలో ఆడటంపై కూడా చాహల్ తనదైన శైలిలో స్పందించాడు.

చిన్నస్వామిలో ఆడేటప్పుడు
"సొంత మైదానం చిన్నస్వామిలో ఆడేటప్పుడు అభిమానుల మద్దతు ఎంతో ఉంటుంది. అభిమానుల కోలాహలం అప్పుడప్పుడు బంతి ఎక్కడ వేస్తున్నానో కూడా అర్ధం కాదు. అయితే, ఇప్పుడు ఇది కొత్త కాదు. ఇక కోహ్లీ విషయానికి వస్తే కెప్టెన్ మద్దతిస్తే... ఏ ఆటగాడైనా చక్కటి ప్రదర్శన చేయగలడు" అని చాహాల్ పేర్కొన్నాడు.

ప్రతి బంతికి వికెట్ తీయాలన్న కసితో
"ప్రతి బంతికి వికెట్ తీయాలన్న కసితో బౌలింగ్ చేయాలని కోహ్లీ ఎప్పుడు చెపుతుంటాడు. పరుగులు పోయినా పట్టించుకోవద్దని అంటాడు. గత సీజన్‌లో కూడా ఇదే బౌలింగ్ విభాగంతో ఉండి మంచి ప్రదర్శన ఇచ్చాం. అయితే ఎవరో ఒకరు, ఏదో ఒక మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన ఆ ఆటగాడిని నిందించడం ఎంతమాత్రం సరికాదు" అని చాహాల్ తెలిపాడు.

అంతర్జాతీయ క్రికెట్ అనుభవం ఉన్నవారే
"మా జట్టులోని బౌలర్లంతా అంతర్జాతీయ క్రికెట్ అనుభవం ఉన్నవారే. అంతర్జాతీయ మ్యాచుల్లో ఆడిన అనుభవం ఐపీఎల్‌లోనూ ఉపయోగపడతుంది. కోహ్లీ, డివిలియర్స్ లాంటి ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూం పంచుకోవడం నిజంగా అదృష్టం. వరల్డ్‌కప్‌కు ముందు ఈ ఐపీఎల్ మ్యాచులు మంచి ప్రాక్టీస్‌లా పనికొస్తాయనేది నా అభిప్రాయం" అని చాహల్ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications