Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విజయాల రహస్యం రిటైర్‌ అయ్యాక చెప్తా: ఎంఎస్ ధోనీ

IPL 2019 : MS Dhoni Says 'Can't Reveal Anything Till I Retire' || Oneindia Telugu
IPL 2019: I cant reveal anything till I retire Says MS Dhoni

చెన్నై వరుస విజయాల రహస్యం చెప్తే వచ్చే ఐపీఎల్‌ వేలంలో చెన్నై యాజమాన్యం నన్ను కొనుగోలు చేయదు. విజయాల రహస్యం రిటైర్‌ అయ్యాక చెప్తా అని చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ సరదాగా అన్నారు. మంగళవారం రాత్రి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ షేన్‌ వాట్సన్‌ (53 బంతుల్లో 96; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో.. చెన్నై 6 వికెట్లతో ఘన విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో మళ్ళీ అగ్రస్థానం నిలబెట్టుకుని ఫ్లే ఆఫ్‌ బెర్త్‌ను కాయం చేసుకుంది.

నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు:

నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు:

మ్యాచ్ అనంతరం చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ... 'కొందరికి అవకాశాలు ఇస్తే మంచి ప్రదర్శన చేస్తారు. ఇదే షేన్‌ వాట్సన్‌ నిరూపించాడు. మ్యాచ్‌ విన్నర్‌ వాట్సనే. అతను నెట్స్‌లో తీవ్రంగా సాధన చేసాడు. గత మ్యాచుల్లో పరుగులు చేయడంలో వాట్సన్ కొద్దిగా ఇబ్బందిపడ్డాడు. అయినా చెన్నై యాజమాన్యం మరిన్ని అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే వచ్చిన అవకాశాన్ని వాట్సన్‌ సద్వినియోగం చేసుకున్నాడు' అని ధోనీ చెప్పుకొచ్చారు.

అది వ్యాపార రహస్యం:

'మా బౌలింగ్‌ ప్రదర్శన బాగుంది. జట్టులోని మరికొంతమంది బ్యాట్స్‌మన్‌ రాణించాల్సిన అవసరం ఉంది. ప్లే ఆఫ్ వరకు గాడిలో పడుతారని అనుకుంటున్నా. చెన్నై వరుస విజయాల రహస్యం అందరికీ చెప్తే వచ్చే ఐపీఎల్‌ వేలంలో చెన్నై యాజమాన్యం నన్ను కొనుగోలు చేయదు. అది వ్యాపార రహస్యం' అని ధోనీ అన్నారు.

రిటైర్‌ అయ్యాక చెప్తా:

రిటైర్‌ అయ్యాక చెప్తా:

'జట్టు విజయాల్లో మాత్రం అభిమానుల మద్దతు, యాజమాన్యం కీలకం. సహాయక సిబ్బంది కూడా మా విజయంలో కీలక పాత్ర పోషించారు. మంచి జట్టు వాతావరణం కోసం సహాయక సిబ్బంది ఎంతో శ్రమిస్తూ ఉంటుంది. ఇంతకు మించి ఎక్కువగా చెప్పను. రిటైర్‌ అయ్యేవరకు ఏం చెప్పలేను. ప్రపంచకప్‌ సమీపిస్తున్న నేపథ్యంలో నేను కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది' అని ధోనీ తెలిపారు.

 చెన్నై విజయం:

చెన్నై విజయం:

డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐపీఎల్‌-12 సీజన్‌లో ప్లే ఆఫ్‌ బెర్త్‌ను ఖరారు చేసుకునట్టే. మంగళవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై విజయాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 175 పరుగులు చేసింది. మనీశ్‌ పాండే (49 బంతుల్లో 83 నాటౌట్‌; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), వార్నర్‌ (45 బంతుల్లో 57; 3 ఫోర్లు, 2 సిక్సర్లు)లు అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన చెన్నై సూపర్‌కింగ్స్‌ 19.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. వాట్సన్‌ (53 బంతుల్లో 96; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రైనా (24 బంతుల్లో 38; 6 ఫోర్లు, 1 సిక్స్‌) పర్వాలేదనిపించాడు.

Story first published: Wednesday, April 24, 2019, 14:21 [IST]
Other articles published on Apr 24, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+