For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌ ఫైనల్‌.. హాట్‌ స్టార్‌ కొత్త రికార్డు

IPL 2019 : Hotstar Sets New Global Record With 18.6 Million Viewers During IPL Final || Oneindia
IPL 2019: Hotstar sets new global streaming record with 18.6 Mn concurrent viewers during IPL final

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-12 (ఐపీఎల్‌) ఫైనల్‌ మ్యాచ్‌లో వెబ్‌ ప్లాట్‌ఫామ్‌ హాట్‌ స్టార్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. గత ఆదివారం హైదరాబాద్ ఉప్పల్ మైదానం వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను ఒకే సమయంలో 18.6 మిలియన్ల (1 కోటి 86 లక్షలు) వీక్షకులు చూసారు. ఈ విషయాన్ని స్వయంగా హాట్‌ స్టార్‌ యాజమాన్యం ప్రకటించింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

గత సంవత్సరం ఫైనల్ మ్యాచ్‌తో పోల్చితే 8.6 మిలియన్లు ఎక్కువ. కేవలం ఫైనల్ మ్యాచ్‌ కోసం 10 మిలియన్ల మంది కొత్తగా లాగిన్ అయ్యారట. ఈ సంవత్సరం చాలా సార్లు 10 మిలియన్ల వ్యూయర్ షిప్ వచ్చాయి. మార్చి 28న జరిగిన ముంబై, బెంగళూరు మ్యాచ్‌ను మాత్రం 12.7 మిలియన్ల మంది చూశారట. ఫైనల్ మ్యాచ్ తర్వాత ఈ మ్యాచ్‌నే అత్యధికంగా చూసారు. గత సంవత్సరం హాట్‌స్టార్‌లో మ్యాచ్‌ను చూసిన వారితో పోలిస్తే.. ఈ సారి వీక్షకుల సంఖ్య ఏకంగా 74 శాతం పెరిగింది. హాట్‌ స్టార్‌ను స్టార్ ఇండియా రన్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఫైనల్‌లో మ్యాచ్‌లో ముంబై ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కీరన్‌ పొలార్డ్‌ (25 బంతుల్లో 41 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), డికాక్‌ (17 బంతుల్లో 29; 4 సిక్సర్లు) రాణించారు. లక్ష ఛేదనలో చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేసి ఓడిపోయింది. ఓపెనర్ షేన్‌ వాట్సన్‌ (59 బంతుల్లో 80; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించినా జట్టును గెలిపించలేకపోయాడు.

Story first published: Wednesday, May 15, 2019, 12:35 [IST]
Other articles published on May 15, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+