ఐపీఎల్ 2019: మ్యాచ్ సమయాల్లో ఎలాంటి మార్పు లేదు

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్ మ్యాచ్ సమయాల్లో ఎటువంటి మార్పులూ ఉండబోవని బీసీసీఐ పాలకుల కమిటీ(సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ స్పష్టం చేశారు. అయితే రాత్రి మ్యాచ్‌లను 7 గంటలకు మారుస్తారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో బీసీసీఐ ఈ విషయంలో స్పష్టత ఇచ్చినట్లు క్రికెట్ పాలకుల కమిటీ తెలిపింది.
ఈ వార్తల్లో నిజం లేదని ఆయన తేల్చిచెప్పారు. గత టోర్నీల్లో మాదిరే సాయంత్రం మ్యాచ్ 4 గంటలకు, రాత్రి మ్యాచ్ 8 గంటలకు ప్రారంభం అవుతాయని ఆయన తెలిపారు. "ఐపీఎల్‌లో రాత్రి జరిగే లీగ్ మ్యాచ్‌లన్నీ 8 గంటలకే ప్రారంభం అవుతాయి. కానీ ప్లేఆఫ్స్, ఫైనల్ మాత్రం రా.7 గంటలకు మొదలవుతాయి" అని రాయ్ అన్నారు.
ఐపీఎల్ 2019 షెడ్యూల్ ఇప్పటికే విడుదల
ఐపీఎల్ 2019 సీజన్ షెడ్యూల్‌ని బీసీసీఐ ఇప్పటికే విడుదల చేసింది. అయితే కేవలం 17 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే బీసీసీఐ ప్రకటించింది. ఐపీఎల్ 2019 సీజన్ మొదటి మ్యాచ్‌లో ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్, కోహ్లీ సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనుంది

మార్చి 23న టోర్నీ ప్రారంభం
మార్చి 23న టోర్నీ ప్రారంభం కానుంధి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తొలి రెండు వారాల షెడ్యూల్‌ను మాత్రం బోర్డు విడుదల చేయడం విశేషం. ఈ రెండు వారాల్లో మొత్తం 17 మ్యాచ్‌లు జరగనున్నాయి. మార్చి 23 నుంచి ఏప్రిల్ 5 మధ్య జరిగే మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐపీఎల్ ట్విటర్‌లో ఉంచారు.

లోక్‌సభ ఎన్నికల తర్వాత మిగతా షెడ్యూల్
మిగతా షెడ్యూల్‌ను లోక్‌సభ ఎన్నికల తర్వాత విడుదల చేసే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్‌ను మార్చి 24న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆడనుంది. నగరంలోని ఉప్పల్ స్టేడియంలో మార్చి 29న రాజస్థాన్ vs సన్‌రైజర్స్ మ్యాచ్‌తో ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ జరగనుంది.

14 రోజుల షెడ్యూల్‌లో మొత్తం 17 మ్యాచ్‌లు
తాజాగా విడుదలైన 14 రోజుల షెడ్యూల్‌లో మొత్తం 17 మ్యాచ్‌లు జరగనున్నాయి. టోర్నీలోని ఎనిమిది జట్లూ నాలుగేసి మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఇందులో రెండు మ్యాచ్‌లు సొంతగడ్డపై మిగిలిన రెండు ప్రత్యర్థి మైదానంలో ఆడనున్నాయి. కాగా బెంగళూరు, ఢిల్లీ జట్లు మాత్రం ఐదేసి మ్యాచ్‌లు ఆడనుండగా సొంతగడ్డపైనే మూడు మ్యాచ్‌లు ఆడేలా షెడ్యూల్‌ని విడుదల చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications