Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఏడు నెలలుగా నెట్స్‌లో కఠోరంగా శ్రమించా: హార్ధిక్‌ పాండ్యా

IPL 2019: Hardik Pandya on playing helicopter shot in front of MS Dhoni

మ్యాచ్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. దాదాపు ఏడు నెలలుగా నెట్స్‌లో కఠోరంగా శ్రమించా.. అంతిమంగా ఫలితాన్ని అందుకున్నా అని ముంబై ఇండియన్స్ ఆటగాడు హార్థిక్‌ పాండ్యా తెలిపారు. బుధవారం రాత్రి వాంఖడే మైదానంలో చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌తో చెలరేగిన పాండ్యా.. ఆ తర్వాత బౌలింగ్‌తో అదరగొట్టి చెన్నై ఆశలపై నీళ్లు జల్లాడు. అద్భుత ప్రదర్శన చేసిన హార్ధిక్‌ పాండ్యాకు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' దక్కింది.

హెలికాప్టర్‌ షాట్‌ ఆడటం చాలా ప్రత్యేకం:
మ్యాచ్ అనంతరం హార్ధిక్‌ పాండ్యా మాట్లాడుతూ... 'ధోనీ భాయ్‌ చాలా మంచి ఆటగాడు. ధోనీ ముందు హెలికాప్టర్‌ షాట్‌ ఆడటం నాకు చాలా ప్రత్యేకం. ఈ షాట్‌ గురించి ధోనీ నన్ను కచ్చితంగా మెచ్చుకుంటాడని ఆశిస్తున్నా. గాయం, వివాదాల కారణంగా అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరమయ్యా. ఆ సమయంలో నాకు అండగా నిలిచిన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఈ అవార్డును అంకితం చేస్తున్నా' అని హార్ధిక్‌ తెలిపారు.

నెట్స్‌లో కఠోరంగా శ్రమించా:
'జట్టు విహాయంలో కీలక పాత్ర పోషించినందుకు చాలా సంతోషంగా ఉంది. దాదాపు ఏడు నెలల పాటు నెట్స్‌లో కఠోరంగా శ్రమించా.. అంతిమంగా ఫలితాన్ని అందుకున్నా. ప్రస్తుతం ఐపీఎల్‌తో పాటు వచ్చే ప్రపంచకప్‌లో ఎలా ఆడాలని దృష్టి సారిస్తున్నా. నాకు అవకాశం వస్తే టీమిండియా కప్ సాధించడంలో నా వంతు కృషి చేస్తా' అని హార్ధిక్‌ పాండ్యా చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, April 4, 2019, 16:29 [IST]
Other articles published on Apr 4, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+