ఐపీఎల్ 2019: నెట్స్‌లో ధోని హెలికాప్టర్ షాట్‌ని కాపీ కొట్టిన పాండ్యా (వీడియో)


హైదరాబాద్: గాయం కారణంగా ఆస్ట్రేలియాతో ముగిసిన ఐదు వన్డే సిరీస్‌కు దూరమైన టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కోలుకున్నాడు. మార్చి 23 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ తరుపున ఆడనున్న హార్ధిక్ పాండ్యా తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఇందులో భాగంగా గురువారం నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు.

నెట్స్‌లో శ్రమించిన పాండ్యా
రిలయన్స్ కార్పోరేట్ పార్క్ క్రికెట్ గ్రౌండ్‌లోని నెట్స్‌లో తాను ప్రాక్టీస్ చేస్తోన్న వీడియోని ట్విట్టర్‌లో అభిమానుల కోసం పంచుకున్నాడు. 'ఈ షాట్ కోసం నాకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి ఎవరో కనుక్కోండి' అంటూ పరోక్షంగా ధోనీని ఉద్దేశిస్తూ రాసుకొచ్చాడు. గాయం కారణంగా ఆసీస్‌తో సిరిస్‌కు దూరం కావడంతో అతడి స్థానంలో జడేజాకు సెలక్టర్లు చోటు కల్పించారు.
భారత్ తరఫున 11 టెస్టులాడిన పాండ్యా
కాగా, హార్ధిక్ పాండ్యా భారత్ తరఫున 11 టెస్టులు, 45 వన్డేలు, 38 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఆల్ రౌండర్స్ అయిన హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా ఇద్దరూ ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో బరోడా జట్టు సూపర్ లీగ్‌కు క్వాలిఫై అయినట్లైతే హార్దిక్ పాండ్యా కొన్ని మ్యాచ్‌లు ఆడేవాడు.

మార్చి 24న వాంఖడే మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో
కాగా రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై జట్టు మార్చి 24న వాంఖడే మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఐపీఎల్ 2019 సీజన్ షెడ్యూల్‌ని బీసీసీఐ ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే కేవలం 17 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే బీసీసీఐ ప్రకటించడం విశేషం.

తొలి రెండు వారాల షెడ్యూల్‌ను మాత్రమే
మార్చి 23న టోర్నీ ప్రారంభం కానుంధి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తొలి రెండు వారాల షెడ్యూల్‌ను మాత్రం బోర్డు విడుదల చేయడం విశేషం. ఈ రెండు వారాల్లో మొత్తం 17 మ్యాచ్‌లు జరగనున్నాయి. మిగతా షెడ్యూల్‌ను లోక్‌సభ ఎన్నికల తర్వాత విడుదల చేసే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications