రాహుల్ అవార్డు తీసుకున్న పాండ్యా.. ట్విట్టర్‌లో పేలుతున్న జోకులు

ఐపీఎల్ 2019 సీజన్ ముగిసింది. 50 రోజుల పాటు పొట్టి క్రికెట్ మాజాను క్రికెట్ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేశారు. ఈ సీజన్-12లో ఒకవైపు ఎన్నో రికార్డులు బద్దలు కాగా.. మరోవైపు ఆటగాళ్ల భావోద్వేగాలు కూడా ప్రేక్షకులకు పరిచమయ్యాయి. దీంతో ఈ సీజన్ మస్త్ మజా పంచింది. ఇక ఫైనల్ మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో ముంబై గెలిచి కప్ సొంతం చేసుకోగా.. చెన్నై రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
రాహుల్‌కు 'స్టైలిష్ ప్లేయర్' అవార్డు:
ఆదివారం ఉప్పల్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ అనంతరం విన్నర్, రన్నరప్ జట్లతో పాటు వివిధ విభాగాలలో క్రీడాకారులకు ప్రైజ్ మనీ అందజేశారు. పంజాబ్ ఓపెనర్ కేఎల్ రాహుల్‌కు 'స్టైలిష్ ప్లేయర్' అవార్డు లభించింది. కేఎల్ రాహుల్ ఈ అవార్డుల ప్రధానోత్సవంకు హాజరుకాకపోవడంతో.. ఇందుకు సంబందించిన అవార్డును స్నేహితుడు, సహచర ఆటగాడు హార్దిక్ పాండ్యా తీసుకున్నాడు.

ట్విట్టర్‌లో జోకులు:
ఇప్పుడు ఈ విషయం ట్విట్టర్‌ను షేక్ చేస్తోంది. అభిమానులు ట్విట్టర్‌లో పాండ్యా, రాహుల్‌లపై జోకులు పేల్చుతున్నారు. 'రాహుల్ తరఫున పాండ్య అవార్డు అందుకున్నాడు. ఓ ఇది నిజమే', 'రాహుల్ తరఫున పాండ్య స్టైలిష్ ప్లేయర్ అవార్డు అందుకున్నాడు. ఇది ఎంతో ప్రత్యేకమైనది', 'ఇది ఫైనల్ వేడుకలలో ప్రత్యేకమైనది', 'ఈ ఘటన అందరిలో కాఫీ షోను గుర్తుచేస్తుంది' అని అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.

మహిళలపై అనుచిత వ్యాఖ్యలు:
బాలీవుడ్ 'కాఫీ విత్ కరణ్' షోలో హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌లు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇద్దరు బహిరంగానే క్షమాపణలు చెప్పడంతో.. ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ చర్యలు తీసుకోకుండా వదిలేసింది. అనంతరం పాండ్యా, రాహుల్‌లు ప్రపంచకప్‌లో చోటు సంపాదించారు. ఐపీఎల్-12లో కూడా ఇద్దరు తమ జట్లకు అద్భుతంగా ఆడారు. కాఫీ విత్ కరణ్ షో సందర్భంగా పాండ్యా, రాహుల్‌లపై జోకులు పేల్చిన నెటిజన్లు.. చాలా కాలం తర్వాత మళ్లీ చెలరేగారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications