న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నా స్ఫూర్తి, స్నేహితుడు, సోదరుడు, లెజెండ్‌: ధోనీని ఉద్దేశించి పాండ్యా

IPL 2019 : Hardik Pandya Posts Emotional Message For MS Dhoni || Oneindia Telugu
IPL 2019: Hardik Pandya Calls MS Dhoni His Inspiration, Friend, Brother & Legend

హైదరాబాద్: చెపాక్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి క్వాలిఫయిర్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ఐదోసారి ఫైనల్‌కు చేరగా... సీఎస్‌కే మాత్రం ఈ సీజన్‌లో మరో మ్యాచ్ ఆడాల్సి వచ్చింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ధోని మెరుపులు

ధోని మెరుపులు

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అంబటి రాయుడు 37 బంతుల్లో 42(3 ఫోర్లు), ధోని 29 బంతుల్లో 37(3 సిక్సులు)తో రాణించడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది.

132 పరుగుల స్వల్ప లక్ష్యంతో

132 పరుగుల స్వల్ప లక్ష్యంతో

అనంతరం సీఎస్‌కే నిర్దేశించిన 132 పరుగుల విజయ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. సూర్యకుమార్ యాదవ్ 54 బంతుల్లో 71(10 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించి ముంబై విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌ అనంతరం ముంబై ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది.

పాండ్యా ట్విట్టర్‌లో

మ్యాచ్ అనంతరం పాండ్యా తన ట్విట్టర్‌లో చెపాక్‌ స్టేడియంలో ధోనీతో కలిసి ఉన్న ఓ ఫొటోను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. అంతేకాదు "నా స్ఫూర్తి, నా స్నేహితుడు, నా సోదరుడు, నా లెజెండ్‌ ఈయనే.. మహేంద్ర సింగ్ ధోనీ" అంటూ పోస్టు చేశాడు. దీంతో పాటు ధోనీ హెలికాప్టర్‌ షాట్లను గుర్తుచేస్తూ హెలికాప్టర్‌ ఎమోజీని పెట్టాడు.

ధోని నాయకత్వంలోనే పాండ్యా అరంగేట్రం

ధోని నాయకత్వంలోనే పాండ్యా అరంగేట్రం

హార్దిక్ పాండ్యా తన అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రాన్ని ధోని నాయకత్వంలోని ఆరంభించాడు. అంతేకాదు ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2019 సీజన్‌లో ధోని హెలికాప్టర్ షాట్లతో అభిమానులను సైతం అలరించాడు. ఇందులో భాగంగానే ధోనీ తనకు స్ఫూర్తి అంటూ పాండ్యా పేర్కొన్నాడు. ఈ సీజన్‌లో పాండ్యా ముంబై విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.

Story first published: Wednesday, May 8, 2019, 16:11 [IST]
Other articles published on May 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X