IPL 2019: సస్పెన్షన్ హార్ధిక్ పాండ్యాను మరింత రాటుదేలేలా చేసింది

హైదరాబాద్: 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి హార్ధిక్ పాండ్యా సస్పెన్షన్‌కు గురైన సంగతి తెలిసిందే. అయితే, ఈ స్పల్పకాలిక నిషేధంలో హార్ధిక్ పాండ్యా కుంగిపోకుండా మరింత రాటుదేలాడని అతడి సోదరుడు కృనాల్ పాండ్యా పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో వీరిద్దరూ ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ విజయాల్లో పాండ్యా కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఫిరోజ్ షా కోట్లా వేదికగా గురువారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా బ్రదర్స్ రాణించడంతో ముంబై 40 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాండ్యా 15 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 32 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకిన ముంబై
ఈ విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. మ్యాచ్ అనంతరం కృనాల్ పాండ్యా మాట్లాడుతూ "గాయాలు, వివాదాలతో క్రికెట్‌కు దూరమైనప్పుడు హార్దిక్ పూర్తిగా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు. నిజం చెప్పాలంటే ఆట మీద పాండ్యకు ఉన్న శ్రద్ధ అతికొద్ది మంది ఆటగాళ్లకే ఉంటుంది" అని అన్నాడు.

కెరీర్ మొదట్లో కేవలం స్పిన్ బౌలింగ్‌లో
"రోజురోజుకీ మరింత మెరుగవ్వడమే అతడి లక్ష్యం. అలా చేయడం వల్ల స్థిరంగా ఆడతామని భావిస్తాడు. కెరీర్ మొదట్లో కేవలం స్పిన్ బౌలింగ్‌లోనే అటాక్ చేసేవాడు. ఇప్పుడు పేస్ బౌలర్లను కూడా ధీటుగా ఎదుర్కొంటున్నాడు. నిషేధ సమయంలో దీనిపై ఎక్కువగా దృష్టి సారించాడు. అందుకే అనుకున్న ఫలితాలను రాబడుతున్నాడు" అని కృనాల్ పాండ్యా చెప్పుకొచ్చాడు.

మొదటి ప్రాధాన్యత క్రికెటే
"మన మొదటి ప్రాధాన్యత క్రికెట్ అనే విషయాన్ని హార్దిక్‌కు ఎప్పుడూ చెబుతూ ఉంటా. పాండ్యాలో రాజీపడని మనస్తత్వమే నాకు చాలా నచ్చుతుంది. దీని కారణంగానే ప్రతి ఏడాది ఆటకు సంబంధించి ఏదో ఒక కొత్త విషయాన్ని హార్ధిక్ నేర్చుకుంటూనే ఉంటాడు. ఇంకా చెప్పాలంటే హార్దిక్ నుంచి నేను కూడా చాలా నేర్చుకున్నాను" అని కృనాల్ పాండ్యా చెప్పాడు.

15 బంతుల్లో 32 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా
హార్ధిక్ పాండ్యా 15 బంతుల్లో 32 పరుగులు చేయగా... కృనాల్ పాండ్యా 26 బంతుల్లో 37 పరుగులు చేశాడు. వీరిద్దరూ కలిసి చివరి మూడు ఓవర్లలో 51 పరుగులు రాబట్టారు. ఇక, ఢిల్లీ మ్యాచ్ గురించి కృనాల్ పాండ్యా మాట్లాడుతూ "మొదట తాము 145 పరుగులు చేస్తే చాలనుకున్నాం, ఈ వికెట్‌పై అంతకన్నా ఎక్కువ పరుగులు చేయలేమని భావించాం. అయితే, పాండ్యా బౌండరీలతో చెలరేగడంతో అదనపు పరుగులు లభించాయి" అని కృనాల్ చెప్పుకొచ్చాడు.

వికెట్ ఎలా మారుతుందో తాము ముందే గ్రహించి
"ఇక, బౌలింగ్ చేసేటప్పుడు వికెట్ ఎలా మారుతుందో తాము ముందే గ్రహించి అందుకు తగ్గట్టే బౌలింగ్ చేశాం. ప్రస్తుతం ఆట జరుగుతున్న తీరు చూస్తే ఏదో ఒక కొత్త విషయంపై దృష్టిపెట్టాలని అలాగైతేనే వికెట్లు దక్కుతాయి" అని అన్నాడు. ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లు వేసిన కృనాల్ ఏడు పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications