ఎంతో కష్టపడ్డాం, కేకేఆర్ పరిస్థితిపై గంభీర్ ఆవేదన: కోహ్లీపై మరోసారి విమర్శలు

హైదరాబాద్: గౌతమ్ గంభీర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో 2011 నుంచి 2017 వరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు సారథిగా వ్యవహరించాడు. తన కెప్టెన్సీలో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు రెండు సార్లు ట్రోఫీని సొంతం చేసుకోవడంతో పాటు మూడు సార్లకు పైగా ప్లేఆఫ్‌కు చేరుకుంది. అయితే, ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 12వ సీజన్‌లో మాత్రం ఆ జట్టు ఆటతీరు మరింత తీసికట్టుగా తయారైంది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో ఐదింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. అంతేకాదు ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. దీనిపై గంభీర్ స్పందిస్తూ "కోల్‌కతా ఆటతీరు నన్నెంతో బాధిస్తోంది. మొదటి మూడేళ్ల తర్వాత ఆ జట్టులో ఓ లెగసీని సృష్టించాం" అని అన్నాడు.

ఎంతో కష్టపడ్డాం
"ఇందుకోసం ఎంతో కష్టపడ్డాం. ఏడేళ్ల పాటు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాణం పెట్టి ఆడాను. జట్టుకు ఆ పేరు తీసుకొచ్చేందుకు నా రక్తాన్ని సైతం ధారపోశా. అయితే, ఇప్పుడు కొంతమంది ఆటగాళ్లు కల్చర్ గురించి మాట్లాడుతున్నారు. ఈ రకమైన వాతావరణం సంతోషకరమైంది కాదు. ఏది అయితేనేం కేకేఆర్‌కు ఆల్ ద బెస్ట్" అని గంభీర్ తెలిపాడు.

కేకేఆర్‌కు ఎంతమాత్రం కలిసి రాలేదు
ఈ సీజన్ కేకేఆర్‌కు ఎంతమాత్రం కలిసి రాలేదని గంభీర్ అన్నాడు. అదే సమయంలో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై గంభీర్ మరోసారి విమర్శలు చేశాడు. ఆర్సీబీకి కెప్టెన్‌గా ఉండటం నిజంగా కోహ్లి అదృష్టమని చెప్పుకొచ్చాడు. అతడు ఆర్సీబీకి మాత్రమే కెప్టెన్‌గా ఉండాలని, భారత జట్టుకు కాదని ముందే సూచించానని గంభీర్ అన్నాడు.

కోహ్లీ కెప్టెన్సీ గురించి మాత్రమే
"ఐపీఎల్‌లో కోహ్లీ కెప్టెన్సీ గురించి మాత్రమే మాట్లాడుతున్నానని, టీమిండియాకు కాదు. ఏడేళ్ల పాటు ఒకే జట్టుకు కెప్టెన్‌గా ఉండి ఒక్కసారి కూడా టైటిల్ తీసుకురాలేదని, అయినా సారథిగా కొనసాగడం అదృష్టం. కోహ్లీ ఉత్తమ ఆటగాడు.. ప్రపంచంలోనే అతడ్ని మించిన బ్యాట్స్‌మెన్ లేరు, ఆ విషయంలో తానూ ఏకీభవిస్తాను. కానీ కెప్టెన్‌గా కోహ్లీ పనికిరాడు" అని గంభీర్ అన్నాడు.

గంభీర్ ఎప్పుడూ అభద్రతా భావంతో ఉండేవాడు
ఇక, గంభీర్ ఎప్పుడూ అభద్రతా భావంతో ఉండేవాడని, కానీ అది అతడిని భారత గొప్పబ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు తెచ్చుకోవడంలో అడ్డుపడలేదని టీమిండియా మాజీ మానసిక కోచ్ ప్యాడీ అప్టన్ ఇటీవల రాసిన బుక్‌లో పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలపై కూడా గంభీర స్పందించాడు. ప్యాడీ వ్యాఖ్యలు తననేమి బాధించలేదని గంభీర్ అన్నాడు.

ప్యాడీ ఓ గొప్ప వ్యక్తి అంటూ ప్రశంస
అంతేకాకుండా ప్యాడీ ఓ గొప్ప వ్యక్తి అంటూ కొనియాడాడు. గత సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించిన గంభీర్... ఆ జట్టు వరుస పరాజయాలు ఎదుర్కొనడంతో సీజన్ మధ్యలోనే వైదొలిగాడు. ఆ తర్వాత ఈ ఏడాది క్రికెట్‌కు వీడ్కోలు పలికి రాజకీయాల్లో చేరాడు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications