న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2019: ఏ అవార్డు ఎవరికి?, పూర్తి అవార్డుల జాబితా ఇదే

IPL 2019 : Full List Of Award Winners At The 12th Edition Of Indian Premier League | Oneindia Telugu
IPL 2019: Full list of award winners at the 12th edition of Indian Premier League

హైదరాబాద్: ఐపీఎల్ 12వ సీజన్ ముగింపు మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఐపీఎల్ పైనల్ మ్యాచ్‌లో చివరకు అంతిమ విజయం ముంబై ఇండియన్స్‌దే అయింది. ఉప్పల్‌ వేదికగా ఆదివారం జరిగిన ఐపీఎల్‌ ఫైనల్లో ముంబై ఇండియన్స్ ఒక్క పరుగు తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. కీరన్‌ పొలార్డ్‌ (41 నాటౌట్‌), డికాక్ (29) ఫరవాలేదనిపించారు. చెన్నై బౌలర్లలో దీపక్ చహర్ మూడు, తాహిర్, శార్దూల్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

అనంతరం లక్ష్యఛేదనలో షేన్ వాట్సన్ 59 బంతుల్లో 80(8 ఫోర్లు, 4సిక్సులు) చివరివరకు పోరాడినప్పటికీ ఓటమి నుంచి జట్టుని తప్పించలేకపోయాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 148 పరుగులకే పరిమితమైంది. ముంబై బౌలర్లలో బుమ్రా రెండు, రాహుల్‌ చాహర్‌ ఒక వికెట్ తీయగా... ఆఖరి ఓవర్‌లో అద్భుత బౌలింగ్‌తో ముంబై విజయంలో మలింగ కీలక పాత్ర పోషించాడు.

ముంబై విజయంలో కీలకపాత్ర పోషించిన జస్ప్రీత్ బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌కి మొత్తం 32,405 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఐపీఎల్ 12వ సీజన్‌లో ఎవరెవరు ఏ అవార్డుని దక్కించుకున్నారో ఒక్కసారి చూద్దాం....

ఐపీఎల్ 2019 విజేత: ముంబై ఇండియన్స్

ఐపీఎల్ 2019 విజేత: ముంబై ఇండియన్స్

ప్రైజ్‌మనీ

ముంబై రూ. 20 కోట్లు

చెన్నై రూ. 12.5 కోట్లు

గత ఛాంపియన్లు

2008 - రాజస్థాన్ రాయల్స్ (RR)

2009 - డెక్కన్ ఛార్జర్స్ (DC)

2010 - చెన్నై సూపర్ కింగ్స్ (CSK)

2011 - CSK

2012 - కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR)

2013 - ముంబై ఇండియన్స్ (MI)

2014 - KKR

2015 - MI

2016 - సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)

2017 - MI

2018 - CSK

రన్నరప్: చెన్నై సూపర్ కింగ్స్

రన్నరప్: చెన్నై సూపర్ కింగ్స్

ఐపీఎల్ 12వ సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ.12.50 కోట్ల ప్రైజ్ మనీని సొంతం చేసుకుంది.

గత రన్నరప్ జట్లు

2008 - చెన్నై సూపర్ కింగ్స్ (CSK)

2009 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)

2010 - ముంబై ఇండియన్స్ (MI)

2011 - RCB

2012 - CSK

2013 - CSK

2014 - కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (KXIP)

2015 - CSK

2016 - RCB

2017 - రైజింగ్ పూణె సూపర్ జెయింట్

2018 - సన్‌రైజర్స్ హైదరాబాద్

ఆరెంజ్ క్యాప్: డేవిడ్ వార్నర్ (సన్‌రైజర్స్ హైదరాబాద్)

ఆరెంజ్ క్యాప్: డేవిడ్ వార్నర్ (సన్‌రైజర్స్ హైదరాబాద్)

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన డేవిడ్ వార్నర్(12 మ్యాచ్‌ల్లో 692) పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఇందులో ఒక సెంచరీ, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆరెంజ్ క్యాప్ కింద వార్నర్‌కు రూ.10 లక్షలు ప్రైజ్ మనీ లభించింది.

గత ఆరెంజ్ క్యాప్ విన్నర్లు

2008 - షాన్ మార్ష్ (KXIP) - 616 runs

2009 - మ్యాథ్యూ హెడెన్ (CSK) - 572

2010 - సచిన్ టెండూల్కర్ (MI) - 618

2011 - క్రిస్ గేల్ (RCB) - 608

2012 - క్రిస్ గేల్ (RCB) - 733

2013 - మైక్ హస్సీ (CSK) - 733

2014 - రాబిన్ ఊతప్ప (KKR) - 660

2015 - డేవిడ్ వార్నర్ (SRH) - 562

2016 - విరాట్ కోహ్లీ (RCB) - 973

2017 - డేవిడ్ వార్నర్ (SRH) - 641 runs

2018 - కేన్ విలియమ్సన్ (SRH) - 735 runs

పర్పుల్ క్యాప్: ఇమ్రాన్ తాహిర్ (చెన్నై సూపర్ కింగ్స్)

పర్పుల్ క్యాప్: ఇమ్రాన్ తాహిర్ (చెన్నై సూపర్ కింగ్స్)

ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడికి ఇచ్చే అవార్డు ఇది. ఈ సీజన్‌లో ఇమ్రాన్ తాహిర్ మొత్తం 15 మ్యాచ్‌లాడి 26 వికెట్లు పడగొట్టాడు. ఈ అవార్డు కింద్ ఇమ్రాన్ తాహిర్ రూ. 10 లక్షలు ప్రైజ్ మనీని లభించింది.

గత పర్పుల్ క్యాప్ విన్నర్లు

2008 - సోహైల్ తన్వీర్ (RR) - 22 wickets

2009 - ఆర్పీ సింగ్ (DC) - 23

2010 - ప్రజ్ఞాన్ ఓజా (DC) - 23

2011 - లసిత్ మలింగ (MI) - 28

2012 - మోర్నీ మోర్కెల్ (DD) - 25

2013 - డ్వేన్ బ్రావో (CSK) - 32

2014 - మోహిత్ శర్మ (CSK) - 23

2015 - డ్వేన్ బ్రావో (CSK) - 26

2016 - భువనేశ్వర్ కుమార్ (SRH) - 23

2017 - భువనేశ్వర్ కుమార్ (SRH) - 26

2018 - ఆండ్రూ టై (KXIP) - 24 wickets

సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్: ఆండ్రీ రస్సెల్

సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్: ఆండ్రీ రస్సెల్

ఐపీఎల్ 12వ సీజన్‌లో సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్ అవార్డుని కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డు కింద ఆండ్రీ రస్సెల్‌కు రూ. 10 లక్షల ప్రైజ్ మనీ లభించింది. ఈ సీజన్‌లో ఆండ్రీ రస్సెల్ మొత్తం 14 మ్యాచ్‌లాడి 31 ఫోర్లు, 52 సిక్సులు బాదాడు. రస్సెల్ స్ట్రయిక్ రేట్ 204.81గా ఉంది.

అత్యంత విలువైన ఆటగాడు: ఆండ్రీ రస్సెల్‌

అత్యంత విలువైన ఆటగాడు: ఆండ్రీ రస్సెల్‌

ఐపీఎల్ 12వ సీజన్‌లో అత్యంత విలువైన ఆటగాడిగా కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డు కింద్ ఆండ్రీ రస్సెల్‌కు టాటా హారియర్ ఎస్‌యువీ లభించింది. ఈ సీజన్‌లో ఆండ్రీ రస్సెల్ 369 పాయింట్లు లభించాయి.

ఎఫ్‌బీబీ స్టైలిష్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్: కేఎల్ రాహుల్

ఎఫ్‌బీబీ స్టైలిష్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్: కేఎల్ రాహుల్

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు కేఎల్ రాహుల్ ఎఫ్‌బీబీ స్టైలిష్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అవార్డుని దక్కించుకున్నాడు. ఈ సీజన్‌లో కేఎల్ రాహుల్ ఎన్నో స్టైలిష్ షాట్లను ఆడాడు. ఈ అవార్డు కింద కేఎల్ రాహుల్‌కు రూ. 10 లక్షలు ప్రైజ్ మనీ లభించింది.

ఫర్‌ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్: కీరన్ పొలార్డ్

ఫర్‌ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్: కీరన్ పొలార్డ్

ముంబై ఇండియన్స్ ఆటగాడు కీరన్ పొలార్డ్‌కు ఫర్‌ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్ అవార్డు లభించింది. లీగ్ స్టేజిలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సురేశ్ రైనాను ఓ అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌కు చేర్చాడు. ఈ అవార్డు కింద కీరన్ పొలార్డ్‌కు రూ. 10 లక్షలు ప్రైజ్ మనీ లభించింది.

ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్: శుభమాన్ గిల్

ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్: శుభమాన్ గిల్

ఐపీఎల్ 12 సీజన్‌లో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అవార్డుని కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు శుభమాన్ గిల్‌ను వరించింది. తనకు అందివచ్చిన అవకాశాన్ని శుభమాన్ గిల్ ఈ సీజన్‌లో చక్కగా వినియోగించుకున్నాడు. ఈ అవార్డు కింద శుభమాన్ గిల్‌కు రూ. 10 లక్షలు ప్రైజ్ మనీ లభించింది.

డ్రీమ్ 11 గేమ్ ఛేంజర్ ఆఫ్ ద సీజన్: రాహుల్ చాహర్

డ్రీమ్ 11 గేమ్ ఛేంజర్ ఆఫ్ ద సీజన్: రాహుల్ చాహర్

ముంబై ఇండియన్స్ లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ డ్రీమ్ 11 గేమ్ ఛేంజర్ ఆఫ్ ద సీజన్ అవార్డుని దక్కించుకున్నాడు. ఉప్పల్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో కూడా రాహుల్ చాహర్ కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన రాహుల్ చాహర్ ఒక వికెట్ తీసి 14 పరుగులు సమర్పించుకున్నాడు.

పేటీఎమ్ ఫెయిర్ ప్లే అవార్డు: సన్‌రైజర్స్ హైదరాబాద్

పేటీఎమ్ ఫెయిర్ ప్లే అవార్డు: సన్‌రైజర్స్ హైదరాబాద్

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు పేటీఎమ్ ఫెయిర్ ప్లే అవార్డు లభించింది. ఆ జట్టు తరుపున ఈ అవార్డుని మాజీ క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ అందుకున్నాడు.

Story first published: Monday, May 13, 2019, 12:39 [IST]
Other articles published on May 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X