Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోని రనౌట్ ట్వీట్‌ను డిలీట్ చేయడంపై కివీస్ క్రికెటర్ వివరణ

IPL 2019 final: Why James Neesham deleted tweet about MS Dhonis controversial run out

హైదరాబాద్: ఏప్రిల్ 12న ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్ పైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఒక పరుగు తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ధోని రనౌట్‌పై సోషల్ మీడియాలో ఇప్పటికీ చర్చనీయాంశం అవుతూనే ఉంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

నిజానికి ధోని రనౌట్‌ని బెన్‌ఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద నాటౌట్‌గా అంఫైర్ ప్రకటించి ఉండి ఉంటే, చెన్నై విజయం సాధించేదని థర్డ్ అంఫైర్ తప్పిదం వల్లే ధోని రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చిందని సీఎస్‌కే అభిమానులు వాదిస్తున్నారు. తాజాగా ఈ రనౌట్‌పై ట్వీట్‌పై చేసిన న్యూజిలాండ్ క్రికెటర్ జిమ్మీ నిషమ్‌‌ను ధోని అభిమానులు ఓ ఆట ఆడుకున్నారు.

ఈ ఏడాది ఐపీఎల్‌లో జేమ్స్ నీషమ్‌ను ఎవరూ కొనుగోలు చేయలేదు. దీంతో ఐపీఎల్‌లో ఆడకున్నప్పటికీ... చెన్నై vs ముంబై జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్లో చోటు చేసుకున్న ధోని రనౌట్‌పై నీషమ్ ట్విట్టర్‌లో స్పందించాడు. "అది కచ్చితంగా రనౌటే. థర్డ్‌ అంపైర్‌ నిర్ణయం నన్ను ఏమీ విస్మయానికి గురి చేయలేదు. కొందరు అభిమానులు క్రికెట్ అంటే ఇంత ప్యాషనేట్‌గా ఉండటం ఎంతగానో నచ్చింది. ధోని అంటే చాలా ఇష్టం. అయితే, అది నాటౌట్ అంటే ఆశ్చర్యంగా ఉంది" అంటూ ధోని రనౌట్ ఫోటోను ట్వీట్ చేశాడు.

నీషమ్ ట్వీట్‌పై చెన్నై అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. "నువ్వో అంతర్జాతీయ క్రికెటర్ అంటే మాకు నమ్మబుద్ది కావడం లేదు. అంపైర్లకే కాదు నీషమ్‌ను కూడా ఎవరో మేనేజ్ చేశారు" అని పెద్ద ఎత్తున కామెంట్లు రావడంతో నీషమ్ ఆ ట్వీట్‌ను డిలీట్ చేశాడు. ఆ ట్వీట్‌ను ఎందుకు డిలీట్ చేస్తున్నానో దానిపై కూడా వివరణ ఇచ్చాడు.

"ధోని రనౌట్ గురించి చేసిన ట్వీట్‌ను తొలిగించాను. అయితే, నా అభిప్రాయాన్ని మార్చుకుని ఈ పని చేయలేదు. రోజూ 200కుపైగా చెత్త కామెంట్స్ రావడం, వాటిని చూసి నేను అనారోగ్యానికి గురయ్యాను. నేను వాటిని లెక్కచేయలేదు. దయచేసి మళ్లీ నాకు ఈ విషయం గురించి ట్వీట్ చేయకండి. హేవ్‌ ఏ గుడ్‌ డే" అంటూ ట్వీట్‌ చేశాడు.

Story first published: Thursday, May 16, 2019, 19:06 [IST]
Other articles published on May 16, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+