Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

2నిమిషాల్లోనే ఐపీఎల్ ఫైనల్ టిక్కెట్లు హాంఫట్.. అభిమానుల ఆగ్రహం

IPl 2019: Final tickets sold out inside 2 minutes, spotlight on BCCI transparency and accountability

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌ అంటేనే అభిమానులు నిండిపోతారు. ఇక టీ20 మ్యాచ్ అంటే దాదాపు స్టేడియం మొత్తం నిండిపోతుంది. ఈ సీజన్‌-12లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సొంత గడ్డపై ఆడిన 7 మ్యాచ్‌లకు అభిమానులు పోటెత్తారు. ప్రతి మ్యాచ్‌కు 30 వేలకుపైనే వచ్చారు. ఇక చెన్నైలో స్టాండ్స్ వివాదం కారణంగా అనూహ్యంగా ఫైనల్ వేదిక హైదరాబాద్‌కు మారడంతో టిక్కెట్ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

విశాఖ, చెన్నై వేదికగా జరిగిన ప్లేఆఫ్‌ మ్యాచ్‌ల టిక్కెట్ల అమ్మకాల వివరాలు తెలిపిన ఐపీఎల్‌ నిర్వాహకులు.. ఫైనల్‌ మ్యాచ్‌ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. మంగళవారం మధ్యాహ్నం ఈవెంట్స్‌నౌ.కామ్‌ సంస్థ ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయం ప్రారంభించగా.. వెబ్‌సైట్‌లో పెట్టిన కొన్ని నిమిషాల్లోనే టిక్కెట్లు అన్నీ అమ్ముడైపోయాయి. దీంతో చాలా మంది అభిమానులు నిరాశతో అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఎటువంటి ప్రకటన చేయకుండా, కనీస సమాచారం కూడా ఇవ్వకుండా గుట్టుచప్పుడు కాకుండా ఈవెంట్స్‌నౌ.కామ్‌ సంస్థ కేవలం రూ.1500, రూ.2000, రూ.2500, రూ.5000 టి టిక్కెట్లు మాత్రమే అందుబాటులో ఉంచింది. మిగతా టిక్కెట్ల గురించి ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఫైనల్ మ్యాచ్ కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూసిన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని టిక్కెట్లు అమ్మకానికి పెట్టారు? మిగతా టిక్కెట్లు ఎక్కడ? ముందుగా సమాచారం ఎందుకు ఇవ్వలేదు? అనే ప్రశ్నలు సంధిస్తున్నారు. టిక్కెట్ల విషయం ఈవెంట్స్‌నౌ ప్రతినిధి సుధీర్‌, హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) సీఈఓ పాండురంగ మూర్తిలను సంప్రదించగా.. వీరిద్దరు అందుబాటులోకి రాలేదు. ఈ వ్యవహారంతో టిక్కెట్ల అమ్మకంపై పలు అనుమానాలు నెలకొన్నాయి.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

Story first published: Thursday, May 9, 2019, 16:26 [IST]
Other articles published on May 9, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+