ఐపీఎల్ ఫైనల్: చెన్నై vs ముంబై మ్యాచ్‌లో నమోదైన గణాంకాలివే!

దీంతో ఐపీఎల్ చరిత్రలో నాలుగు టైటిళ్లను నెగ్గిన జట్టుగా ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో షేన్ వాట్సన్(80) చివరివరకు పోరాడాడు. ఆఖరి ఓవర్‌లో చెన్నై విజయానికి 9 పరుగులు అవసరమయ్యాయి.
ఈ తరుణంలో అనూహ్యంగా పుంజుకొన్న ముంబై బౌలర్లు వాట్సన్‌ను రనౌట్ చేయడంతో తిరిగి పోటీలోకొచ్చింది. ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరమైన దశలో ఇరు జట్ల శిబిరాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. దీంతో అందరూ సూపర్ ఓవర్ ఖాయమేనని అనుకున్నారు. అయితే, చివరి బంతికి శార్దూల్ ఠాకూర్ వికెట్ తీసి మలింగ మ్యాచ్‌ను ముంబైవైపు తిప్పాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఈ మ్యాచ్‌లో నమోదైన గణాంకాలు:

ముంబై గెలిచిన ఐపీఎల్ టైటిళ్ల సంఖ్య
4 - ముంబై ఇండియన్స్ గెలిచిన ఐపీఎల్ టైటిళ్ల సంఖ్య. లీగ్‌లో మరే జట్టూ ఇన్నిసార్లు విజేతగా నిలవలేదు. చెన్నై సూపర్ కింగ్స్ మూడు టైటిళ్లతో రెండో స్థానంలో ఉంది.
132 - ఐపీఎల్‌లో అత్యధిక ఔట్లలో పాలుపంచుకున్న వికెట్ కీపర్‌గా ధోనీ నిలిచాడు. ఈ మ్యాచ్‌తో ధోనీ 132 మందిని పెవిలియన్ పంపాడు. అందులో 94 క్యాచ్‌లు, 38 స్టంపింగ్‌లు ఉన్నాయి. దినేశ్ కార్తీక్ (131)రెండో స్థానానికి చేరాడు.
40 - ఐపీఎల్ ఫైనల్లో ఆడిన అతిపెద్ద వయస్కుడిగా చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ నిలిచాడు. 40 ఏళ్ల వయసులో తాహిర్ చెన్నై తరఫున బరిలో దిగాడు.

రెండో స్పిన్నర్‌గా ఇమ్రాన్ తాహిర్ రికార్డు
2 - ఐపీఎల్ చరిత్రలో పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్న రెండో స్పిన్నర్‌గా ఇమ్రాన్ తాహిర్ నిలిచాడు. గతంలో ప్రజ్ఞాన్ ఓజా (2010లో) ఈ ఘనత సాధించాడు.
4 - కెప్టెన్‌గా నాలుగు భిన్న టైటిళ్లను సొంతం చేసుకున్న మొట్టమొదటి కెప్టెన్‌గా రోహిత్ శర్న నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన మహేంద్ర సింగ్ ధోని రికార్డుని అధిగమించాడు.
5 - ఐదు ఐపీఎల్ ఫైనల్స్‌లో విజయం సాధించిన జట్టులో రోహిత్ శర్మ సభ్యుడిగా ఉన్నాడు. 2009లో డెక్కన్ చార్జర్స్ తరుపున ఆ తర్వాత ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా నాలుగు సార్లు రోహిత్ శర్మ ఐపీఎల్ ఫైనల్స్ ఆడాడు.

కెప్టెన్‌గా రోహిత్ శర్మ వంద శాతం
6 - టీ20ల్లో కెప్టెన్‌గా రోహిత్ శర్మ విన్నింగ్ రికార్డు వందశాతంగా నమోదైంది.
4001 - టీ20 ఫార్మాట్‌లో ముంబై ఇండియన్స్ తరుపున 4000 పరుగులు సాధించిన తొలి ప్లేయర్‌గా రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఫైనల్ మ్యాచ్‌లో హర్భజన్ సింగ్ నాలుగో ఓవర్‌లో బౌండరీ బాదడంతో ద్వారా రోహిత్ శర్మ ఈ ఘనత సాధించాడు.
2 - ఐపీఎల్ 12వ సీజన్‌లో నమోదైన హ్యాట్రిక్‌లు. శ్రేయస్ గోపాల్ (బెంగళూరుపై), శామ్ కర్రన్ (డిల్లీపై)పై ఈ ఘనత సాధించారు.

ఈ సీజన్‌లో నమోదైన సెంచరీలు
6 - ఈ ఐపీఎల్‌లో నమోదైన సెంచరీలు. డేవిడ్ వార్నర్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, జానీ బెయిర్‌స్టో, అజ్యింకే రహానే, సంజూ శాంసన్ సాధించారు.
8 - ఈ సీజన్‌లో డేవిడ్ వార్నర్ సాధించిన అర్థసెంచరీలు. అత్యధిక యాభైల రికార్డు అతడిదే.
28 - ఈ సీజన్‌లో ఒక ఓవర్లో నమోదైన అత్యధిక పరుగులు. బెంగళూరుపై ఆండ్రీ రస్సెల్ ఈ ఘనత సాధించాడు.
66 - ఓ మ్యాచ్‌లో బౌలర్ సమర్పించుకున్న అత్యధిక పరుగులు. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ముజీబ్ రెహ్మాన్ ఇచ్చుకున్నాడు.
114 - ఈ ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు. బెంగళూరుపై బెయిర్‌స్టో (హైదరాబాద్) నమోదు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications