IPL 2019 Final: MI vs CSK: ఐపీఎల్ 12వ సీజన్ విజేత ఎవరో?

హైదరాబాద్: ఐపీఎల్ 12వ సీజన్ తుది దశకు చేరుకుంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. వాస్తవానికి ఈ రెండు జట్లు తలపడితే ఫేవరెట్ ఎవరో చెప్పడం కష్టంగా ఉండేది. కానీ, ఈ సీజన్‌లో చెన్నైపై లీగ్ దశలో రెండుసార్లు, క్వాలిఫయర్‌లో ఓసారి మొత్తం మూడు విజయాలతో గణాంకాలను చూస్తే ముంబైకే అవకాశాలున్నాయి.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
దీంతో పాటు 2018 నుంచి రెండు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌లు జరగ్గా నాలుగింటిలో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. గతంలో చెన్నైతో జరిగిన మూడు ఫైనల్స్‌లోనూ రెండుసార్లు నెగ్గిన జోష్‌తో ముంబై ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇదే ఊపులో ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ బృందం కప్‌ను ఎగరేసుకుపోతుందో? లేక ఈ ఓటములకు ధోని సేన ప్రతీకారం తీర్చుకుంటుందో? చూడాలి.

చెన్నై సూపర్ కింగ్స్ బలాలు
చెన్నై బలం ధోనీనే. సాధారణ ఆటగాడి నుంచి అసాధారణ ప్రదర్శనను రాబట్టడంలో ధోనికి సాటిలేరు. సరైన సమయంలో బౌలింగ్ మార్పులు చేయడంతో పాటు పీల్డింగ్ కూర్పులు చేయడంతో ధోని దిట్ట. ఈ సీజన్‌లో ధోని సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. గత మ్యాచ్‌లో ఓపెనర్లు వాట్సన్, డుప్లెసిస్ హాఫ్ సెంచరీలతో రాణించడం కలిసొచ్చే అంశం. ఆడిన 10 సీజన్లలో 8 సార్లు ఫైనల్ చేరింది.

చెన్నై బలహీనతలు
ఈ సీజన్‌లో తలపడ్డ మూడుసార్లు ముంబై చేతిలో ఓడటం చెన్నై సూపర్ కింగ్స్‌ని కలవరపెడుతోంది. ఈ లీగ్‌లో 8 సార్లు ఫైనల్ చేరిన చెన్నై 3 సార్లు టైటిల్ ముద్దాడితే.. 4 సార్లు ఫైనల్ చేరిన ముంబై మూడు సార్లు ట్రోఫీ గెలుచుకుంది. బౌలింగ్‌లో పెద్దగా ఇబ్బందులు లేకున్నా.. బ్యాటింగ్‌లో నిలకడలేమే ప్రధాన సమస్యగా మారింది. రైనా, రాయుడు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలేదు. సొంతగడ్డపై క్వాలిఫయర్-1తో సహా రోహిత్ శర్మ మొత్తం మూడు మ్యాచ్‌ల్లో ఓడింది.

ముంబై ఇండియన్స్ బలాలు
ఐపీఎల్ ఫైనల్లో చెన్నైతో మూడు సార్లు తలపడితే.. అందులో రెండు సార్లు (2013, 2015) పైచేయి సాధించింది. ఈ సీజన్‌లో నూ సూపర్‌కింగ్స్‌తో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ముంబై దే విజయం. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ ముంబైకి అద్భుతమైన లైనప్ కలిగి ఉంది.

ముంబై ఇండియన్స్ బలహీనతలు
వెటరన్ బౌలర్లు ఇమ్రాన్ తాహి ర్, హర్భజన్ సింగ్‌లను కాచుకోవడమే ముంబైకి ప్రధాన సమస్య. వారిద్దరిని సమర్థవంతంగా ఎదుర్కోంటే సగం మ్యాచ్లో విజయం సాధించనట్లే. నాకౌట్ మ్యాచ్‌ల్లో ధోనీలాగే ఆలోచించే రోహిత్ శర్మ కూడా ముందుండి జట్టును నడిపించాల్సిన అవసరముంది.

సెంటిమెంట్ ఫలించేనా?
2013, 2015, 2017... ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచిన సంవత్సరాలు. దీనిని బట్టి చూస్తే రెండేళ్ల గ్యాప్‌తో ఈ జట్టు కప్ కొడుతూ వస్తోంది. ఇప్పుడు 2019 వచ్చింది. ఈ సెంటిమెంట్ ఫలిస్తే ఉప్పల్‌లో విజేతగా నిలిచేది ముంబై ఇండియన్స్ లేక డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్‌ను కాపాడుకుంటుందా?

తొలి నలుగురు చెన్నై ఆటగాళ్లే
ఇండియన్ ప్రీమయిర్ లీగ్ (ఐపీఎల్) ఫైనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన తొలి నలుగురు ఆటగాళ్లు చెన్నైకి చెందిన వారే కావడం విశేషం. సురేశ్ రైనా (241 పరుగులు), మురళీ విజయ్ (181 పరుగులు), ధోనీ (178 పరుగులు), షేన్ వాట్సన్ (156 పరుగులు) అత్యధిక పరుగులు చేసిన వారిలో ముందున్నారు

ఇది రెండోసారి
హైదరాబాద్‌లో ఫైనల్ జరగడం ఇది రెండోసారి. 2017లో పుణెతో జరిగిన తుదిపోరులో ముంబై గెలిచింది. ముంబై, చెన్నై జట్ల మధ్య ఇది నాలుగో ఫైనల్. గత ఫైనల్స్‌లో చెన్నై ఓసారి (2010) .. ముంబై రెండుసార్లు (2013, 2015) నెగ్గాయి.

జట్లు అంచనా
చెన్నై సూపర్ కింగ్స్: వాట్సన్, డు ప్లెసిస్, రైనా, రాయుడు, ధోని, బ్రేవో, జడేజా, దీపక్ చహర్, హర్భజన్, తాహిర్, శార్దుల్/మురళీ విజయ్.
ముంబై ఇండియన్స్: డికాక్, రోహిత్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్, కృనాల్, పొలార్డ్, బెన్ కటింగ్/జయంత్ యాదవ్, రాహుల్ చహర్, మలింగ, బుమ్రా.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications