న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌: ఫైనల్‌ మ్యాచ్ హైదరాబాద్‌లోనే?

IPL 2019 Final May Be Shifted To Hyderabad || Oneindia Telugu
IPl 2019: Final Match may be shifted to Hyderabad from Chennai

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్-12 ఫైనల్ మ్యాచ్‌ హైదరాబాద్‌ నగరంలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం)లో జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు బీసీసీఐ క్రికెట్‌ పరిపాలకుల కమిటీ (సీఓఏ) దాదాపుగా ఖరారు చేసింది. అయితే ఓ వారం రోజులలో ఫైనల్ మ్యాచ్ జరిగే వేదికపై స్పష్టత రానుంది. కచ్చితంగా ఫైనల్ మ్యాచ్ మాత్రం చెన్నై లేదా హైదరాబాద్‌లో జరగనుంది.

స్టాండ్స్‌ వివాదం:

స్టాండ్స్‌ వివాదం:

నిజానికి.. ఐపీఎల్ సీజన్-11 విజేతగా సూపర్‌ కింగ్స్‌ నిలవడంతో చెన్నైలో ఫైనల్‌ మ్యాచ్‌ జరగాలి. అయితే చిదంబరం స్టేడియంలో గత 7 సంవత్సరాలుగా స్టాండ్స్‌ వివాదం కొనసాగుతోంది. తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్, చెన్నై మున్సిపల్‌ కార్పొరేషన్‌ మధ్య గొడవ కారణంగా.. చిదంబరం స్టేడియంలో ఏ మ్యాచ్‌ జరిగినా మూడు స్టాండ్‌లు ఖాళీగానే ఉంటున్నాయి.

వారం గడువు:

వారం గడువు:

సోమవారం సీఓఏ అధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో స్టాండ్స్‌ వివాదం పరిష్కరించుకునేందుకు అసోసియేషన్‌కు వారం రోజులు గడువిచ్చింది. ఈ వారం రోజుల్లో సమస్య పరిష్కారం కాకపొతే హైదరాబాద్‌లోనే ఫైనల్‌ నిర్వహిస్తాం అని సీఓఏ తేల్చేసింది. సీఓఏ సభ్యులతో పాటు బోర్డు అధికారులు సీకే ఖన్నా, అమితాబ్‌ చౌదరి, అనిరుధ్‌ చౌదరిలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్, ప్లే ఆఫ్‌ మ్యాచ్‌ల వేదికలను ఖరారు చేయడంతో పాటు ఇతర విషయాలపై కూడా చర్చ జరిగింది.

ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లు బెంగళూరులో:

ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లు బెంగళూరులో:

బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ... 'చిదంబరం స్టేడియంలో మూడు స్టాండ్‌లు అంటే 12 వేల మంది ప్రేక్షకులు లేకపోతే మైదానం ఖాళీగా ఉంటుంది. ఇది ఫైనల్ మ్యాచ్‌కు అంత మంచిది కాదు. ప్లే ఆఫ్‌కు వెళితే సొంత మైదానంలో ఆడే అవకాశం చెన్నై కోల్పోకూడదు. క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ తీసుకురాకపోతే మాత్రం 2018 రన్నరప్‌ హైదరాబాద్‌లోనే ఫైనల్‌ నిర్వహిస్తాం. ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లు బెంగళూరులో జరుగుతాయి' అని చెప్పుకొచ్చారు.

Story first published: Tuesday, April 9, 2019, 9:55 [IST]
Other articles published on Apr 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X