Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్-12 జట్టు.. అందుకే శ్రేయస్‌ అయ్యర్‌ను ఎంచుకున్నా: కుంబ్లే

IPL 2019 Final: Anil Kumble picks his best XI for the season, Clarifies Shreyas Iyer Choose

తాజాగా భారత మాజీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే తన ఉత్తమ ఐపీఎల్‌-12 జట్టును ప్రకటించాడు. ఈ జట్టుకు టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీని కెప్టెన్‌గా ఎంచుకున్నాడు. అయితే వన్‌ డౌన్‌ బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లీని కాకుండా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ను తీసుకున్నాడు. తన జట్టు ఆటగాళ్ల ఎంపికపై కుంబ్లే వివరణ ఇచ్చాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

'శ్రేయస్‌ అయ్యర్‌ మంచి నైపుణ్యం ఉన్న ఆటగాడు. ఈ ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిగా బ్యాటింగ్‌ చేసాడు. ఢిల్లీ పిచ్‌ బ్యాటింగ్‌కు అంతగా అనుకూలించదు, అయినా కూడా శ్రేయస్‌ బ్యాటింగ్‌ చేసి చూపించాడు. 16 మ్యాచుల్లో 463 పరుగులు చేశాడు' అని కుంబ్లే వివరణ ఇచ్చాడు.

'డేవిడ్ వార్నర్‌, జానీ బెయిర్‌ స్టోలు ఇద్దరూ ప్రమాదకర ఆటగాళ్లు. మొదటగా బెయిర్‌స్టోను తీసుకోవాలని అనుకున్నా.. కానీ జట్టు సమతూకం కోసం కేఎల్ రాహుల్‌కు ఓటేశా. ఈ సీజన్-12లో ఆల్‌రౌండర్లు హార్దిక్‌ పాండ్య, రసెల్‌లు భారీ హిట్టింగ్ చేస్తున్నారు. మిడిల్‌ ఆర్డర్‌లో వారికి కచ్చితంగా చోటు కల్పించాల్సిందే' అని కుంబ్లే అన్నారు.

కుంబ్లే జట్టు:
కేఎల్ రాహుల్, డేవిడ్‌ వార్నర్, శ్రేయాస్ అయ్యర్‌, ఎంఎస్ ధోనీ (కెప్టెన్/కీపర్), రిషబ్‌ పంత్‌, ఆండ్రీ రసెల్, హార్దిక్ పాండ్యా, ఇమ్రాన్ తాహిర్, శ్రేయాస్ గోపాల్, కాగిసో రబడ, జస్ప్రీత్ బుమ్రా.

Story first published: Saturday, May 11, 2019, 18:17 [IST]
Other articles published on May 11, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+