Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ప్రతి మ్యాచ్‌లో రసెల్‌ ఆడతాడనుకోవడం సరైంది కాదు'

IPL 2019 : Dinesh Karthik Says 'Expecting Andre Russell To Deliver Everytime Unfair' || Oneindia
IPL 2019: Expecting Andre Russell to deliver everytime unfair says Dinesh Karthik

ఆండ్రీ రసెల్‌ ఐపీఎల్ సీజన్-12 మొత్తంగా ఆకట్టుకున్నాడు. అయితే ప్రతి మ్యాచ్‌లో రసెల్‌ ఆడతాడనుకోవడం సరైంది కాదు అని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్ దినేష్ కార్తీక్ అభిప్రాయపడ్డారు. ఆదివారం వాంఖెడే మైదానం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఓడిపోయింది. ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చేతులెత్తేసి కోల్‌కతా టోర్నీ నుండి నిష్క్రమించగా.. అనూహ్యంగా హైదరాబాద్ ప్లే ఆఫ్ చేరింది.

6 ఓవర్ తర్వాత తడబడ్డాం:

6 ఓవర్ తర్వాత తడబడ్డాం:

మ్యాచ్ అనంతరం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్ దినేష్ కార్తీక్ మాట్లాడుతూ... 'బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 6 ఓవర్ తర్వాత మేము తడబడ్డాం. మరోవైపు వికెట్ కూడా అంతలా సహకరించలేదు. బంతి బాగా టర్న్ అయింది. ఈ అవకాశాన్ని ముంబై బౌలర్లు సద్వినియోగం చేసుకున్నారు. మంచు కారణంగా రెండవ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కొంచెం తేలికవుతుంది. ఇది ముంబైకి కలిసొచ్చింది' అని కార్తీక్ పేర్కొన్నారు.

రసెల్‌ అద్భుతంగా ఆడాడు:

రసెల్‌ అద్భుతంగా ఆడాడు:

'రసెల్‌ టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్‌ చేయడానికి అవకాశం ఉంది. కానీ ప్రతి మ్యాచ్‌లో రసెల్‌ ఆడతాడనుకోవడం సరైంది కాదు. అతడి మీద ఆధార పడటం సబబు కాదు. ఈ టోర్నమెంట్‌ మొత్తంలో రసెల్‌ అద్భుతంగా ఆడాడు. ఈ సీజన్‌ అంతగా కలిసిరాలేదు, మాకు ఇది ఉత్తమ సీజన్ కాదు. చాలా విషయాల్లో మేము మెరుగుపడాలి. వచ్చే ఏడాది అవన్ని అధిగమించి మరింత ఆత్మవిశ్వాసంతో వస్తాం' అని కార్తీక్ చెప్పుకొచ్చారు.

కోల్‌కతా ఓటమి:

కోల్‌కతా ఓటమి:

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. క్రిస్‌ లిన్‌ (29 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రాబిన్‌ ఉతప్ప (47 బంతుల్లో 40; 1 ఫోర్, 3 సిక్సర్లు)లు ఆదుకున్నారు. అనంతరం ముంబై 16.1 ఓవర్లలో వికెట్‌ కోల్పోయి 134 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (48 బంతుల్లో 55 నాటౌట్‌; 8 ఫోర్లు), సూర్య కుమార్‌ (27 బంతుల్లో 46 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు)లు చెలరేగారు.

Story first published: Monday, May 6, 2019, 12:48 [IST]
Other articles published on May 6, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+