ఐపీఎల్ 2019: ఎలిమినేటర్: శుభమాన్ గిల్ రికార్డుని సమం చేసిన పృథ్వీ షా

హైదరాబాద్: విశాఖపట్నం వేదికగా బుధవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ యువ ఓపెనర్ పృథ్వీ షా ఓ అరుదైన రికార్డుని నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో పృథ్వీ షా 38 బంతుల్లో 56(6 ఫోర్లు, 2 సిక్సులు)తో హాఫ్ సెంచరీతో చెలరేగి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
పృథ్వీ షాకి మొత్తంగా ఇది నాలుగో ఐపీఎల్ సెంచరీ కాగా ఈ సీజన్‌లో రెండోది. దీంతో ఐపీఎల్‌లో నాలుగు సెంచరీలు సాధించిన టీనేజర్ల ఆటగాళ్ల జాబితాలో శుభమాన్ గిల్ సరసన పృథ్వీ షా నిలిచాడు. ఈ క్రమంలో జట్టులోని తన సహచర ఆటగాడు రిషబ్ పంత్ మూడు హాఫ్ సెంచరీలను షా అధిగమించాడు.
నాలుగు సెంచరీలు చేసిన పృథ్వీ షా
శుభమాన్ గిల్ కూడా ఇప్పటివరకు నాలుగు సెంచరీలు సాధించాడు. మొహాలీ వేదికగా గత శనివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ (49 బంతుల్లో 65) పరుగులు చేయడం ద్వారా ఈ ఘనత సాధించాడు.
ఈ జాబితాలో మూడు హాఫ్ సెంచరీలతో సంజూ శాంసన్(రాజస్థాన్ రాయల్స్), రిషబ్ పంత్(ఢిల్లీ క్యాపిటల్స్), ఇషాన్ కిషన్(ముంబై ఇండియన్స్) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఐపీఎల్ నాలుగుపైగా హాఫ్ సెంచరీలు
ఐపీఎల్‌లో నాలుగు హాఫ్ సెంచరీలు నమోదు చేసిన టీనేజర్స్:
4 - శుభమాన్ గిల్/ పృథ్వీ షా
3 - సంజూ శాంసన్/రిషబ్ పంత్/ ఇషాన్ కిషన్
1- గోస్వామి/ మనీష్ పాండే/ దీపక్ హుడా/ రేయాన్ పరాగ్

162 పరుగులు చేసిన సన్‌రైజర్స్
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. అనంతరం 163 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసి విజయం సాధించింది.

టోర్నీ నుంచి సన్‌రైజర్స్ నిష్క్రమణ
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఓపెనర్ పృథ్వీ షా 38 బంతుల్లో 56(6 ఫోర్లు, 2 సిక్సులు) హాఫ్ సెంచరీతో రాణించగా... రిషబ్ పంత్ 21 బంతుల్లో 49(2 ఫోర్లు, 5 సిక్సులు) మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ ఓటమితో సన్‌రైజర్స్ టోర్నీ నుంచి తప్పుకోగా.... శుక్రవారం ఇదే స్టేడియంలో జరిగే క్వాలిఫయిర్ 2 మ్యాచ్‌లో చెన్నైతో ఢిల్లీ తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications