న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హైదరాబాద్, ఢిల్లీ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్.. రేసులో నిలిచేదెవరో?

IPL 2019,Eliminator : Delhi Capitals V Sunrisers Hyderabad Eliminator Match Preview ! || Oneindia
IPL 2019, Eliminator Match: DC vs SRH Preview: Can Delhi rise against Hyderabad?

విశాఖపట్నం వేదికగా బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య ఐపీఎల్‌-12 ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరగనుంది. ఓడిన జట్టు టోర్నీ నుండి నిష్క్రమిస్తుంది. ఇక గెలిచిన జట్టు మాత్రం క్వాలిఫయర్-2లో చెన్నైతో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. లీగ్‌ దశలో రెండు జట్ల ప్రయాణం భిన్నంగా సాగింది. ఢిల్లీ 9 విజయాలను అందుకుని ప్లే ఆఫ్స్‌ చేరగా.. సన్‌రైజర్స్‌ 6 విజయాలు అందుకున్నా అదృష్టం తోడై నాలుగో బెర్త్ ఖాయం చేసుకుంది. ఢిల్లీ టాపార్డర్‌ బ్యాటింగ్‌ బలంగా ఉంటే, హైదరాబాద్‌ బౌలింగ్‌లో పటిష్టంగా ఉంది. కీలకమైన మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందో చూడాలి.

టాపార్డర్‌ జోరు కొనసాగిస్తే కష్టాలే:

టాపార్డర్‌ జోరు కొనసాగిస్తే కష్టాలే:

ఢిల్లీ ఓపెనర్లు శిఖర్ ధావన్, పృథ్వీ షాలు ఆరంభంలో పరుగుల వరద పారిస్తున్నారు. ముఖ్యంగా తొలి ఆరు ఓవర్లలో భారీ షాట్లతో విరుచుకుపడుతూ వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధిస్తున్నారు. ఇదే ఢిల్లీకి కలిసొచ్చింది. ధావన్‌ జోరు కొనసాగిస్తే హైదరాబాద్ జట్టుకు కష్టాలు తప్పవు. ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టు కష్టాల్లో ఉన్నపుడు ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. పరిస్థితులను బట్టి అయ్యర్ బ్యాట్ జుళిపిస్తున్నాడు. వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడితే భారీ స్కోరు ఖాయం. హిట్టర్లు ఇంగ్రామ్, రూథర్‌ఫర్డ్‌లు కూడా ఉన్నారు. దీంతో ఢిల్లీ మిడిలార్డర్ బ్యాటింగ్ బలంగా ఉంది. చివరలో మెరుపులు మెరిపించడానికి క్రిస్ మోరిస్, అక్షర్ పటేల్, రాహుల్ తెవాటియాలు ఉండడం అదనపు బలం.

రబడ స్థానంలో బౌల్ట్‌:

రబడ స్థానంలో బౌల్ట్‌:

ఢిల్లీ ప్రధాన బౌలర్ రబడ స్వదేశానికి వెళ్లినా.. ఆ లోటును ఎడమ చేతివాటం పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ పూడ్చాడు. అయితే ప్లేఆఫ్స్‌కు ముందు రబడ దూరం కావడం డిల్లీకి పెద్ద లోటు. ఇషాంత్‌ శర్మ తన అనుభవంతో కీలకం సమయంలో వికెట్లు తీస్తున్నాడు. అక్షర్‌ పటేల్, అమిత్‌ మిశ్రాలు స్పిన్‌ విభాగంలో రాణిస్తున్నారు. లీగ్ చరిత్రలో ఢిల్లీ ఇప్పటివరకు ఫైనల్ చేరలేదు. మరీ ఈసారి యువ జట్టు చరిత్ర సృష్టిస్తుందేమో చూడాలి.

మిడిల్ ఆర్డర్ బలహీనం:

మిడిల్ ఆర్డర్ బలహీనం:

ఓపెనర్లు బెయిర్‌స్టో, వార్నర్‌.. ఆల్‌రౌండర్‌ షకీబుల్‌ హసన్‌ వంటి స్టార్ ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో సన్‌రైజర్స్‌ ఒక్కసారిగా సాధారణ జట్టులా మారింది. అయితే ఇన్నింగ్స్‌ ఆరంభంలో గప్టిల్, సాహాలు రాణిస్తున్నారు. అయితే భారీ భాగస్వామ్యం మాత్రం నెలకొల్పలేకపోతున్నారు. సాహా ఉన్నంత సేపు బ్యాట్‌ జుళిపిస్తున్నాడు. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ మనీష్‌ పాండే ఫామ్ సన్‌రైజర్స్‌కు కలిసొచ్చే అంశం. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఇంతవరకు సరిగా ఆడలేదు. విజయ్ శంకర్ ఉన్నా పెద్దగా ఉపయోగం లేదు. హుడా, పఠాన్, రికీ భుయ్ ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. దీంతో సన్‌రైజర్స్‌ మిడిల్ ఆర్డర్ బలహీనంగా ఉంది. కీలక మ్యాచ్‌లో వీళ్లు కూడా రాణిస్తే.. రైజర్స్ కష్టాలు కొంత తీరుతాయి.

పటిష్ట బౌలింగ్:

పటిష్ట బౌలింగ్:

బ్యాటింగ్ బలహీనంగా ఉన్నా.. సన్‌రైజర్స్‌కు పటిష్ట బౌలింగ్ ఉంది. పేసర్లు భువనేశ్వర్, ఖలీల్ అహ్మద్, సందీప్, సిద్ధార్థ్‌లు రాణిస్తున్నారు. భువనేశ్వర్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయినా.. ఖలీల్ అహ్మద్ అదరగొడుతున్నాడు. స్పిన్ ద్వయం రషీద్, నబీలు వికెట్లు పడగొట్టడంతో పాటు పరుగులు నియంత్రించడంలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. మిస్టరీ స్పిన్నర్‌ రషీద్‌ను ఎదుర్కోవడం ఢిల్లీకి కష్టమే. అందరూ సమిష్టిగా రాణిస్తే విజయం సులువే.

జట్లు (అంచనా):

జట్లు (అంచనా):

ఢిల్లీ క్యాపిటల్స్:

పృథ్వీషా, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, కొలిన్ ఇంగ్రామ్, రూథర్‌ఫోర్డ్, పాల్, అక్షర్ పటేల్, మిశ్రామిశ్రా, ఇషాంత్ శర్మ, ట్రెంట్ బౌల్ట్.

సన్‌రైజర్స్ హైదరాబాద్:

వృద్ధిమాన్ సాహా, మార్టిన్ గప్టిల్, మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్, యూసఫ్ పఠాన్/దీపక్ హుడా, మహ్మద్ నబీ, రషీద్ కహాన్, ఖలీల్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, బాసిల్ థంపీ.

Story first published: Wednesday, May 8, 2019, 9:49 [IST]
Other articles published on May 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X